NTV Telugu Site icon

America: భారతీయ అమెరికన్‌కు అరుదైన గౌరవం.. 23 ఏళ్లకే అమెరికా చట్టసభలోకి..

Nabeela Syed

Nabeela Syed

America: అమెరికాలో మంగళవారం జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఓ భారతీయ అమెరికన్‌కు అరుదైన గౌరవం దక్కింది. డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన నబీలా సయ్యద్‌ 23 ఏళ్లకే ఇల్లినాయిస్‌ రాష్ట్ర చట్టసభకు ఎన్నికై రికార్డు నెలకొల్పారు. మధ్యంతర ఎన్నికల్లో భాగంగా ఇల్లినాయిస్‌ నుంచి రాష్ట్ర చట్టసభకు ఎన్నికయ్యారు. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లిక్‌ పార్టీకి చెందిన క్రిస్‌ బోస్‌పై ఆమె విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో నబీలాకు 52.3 శాతం ఓట్లు రాగా.. ఈ మేరకు తన ఆనందాన్ని ఆమె ట్విటర్ వేదికగా పంచుకున్నారు.

Pakistan PM: ‘152/0 వర్సెస్ 170/0’.. భారత్‌ సెమీస్‌ ఓటమిపై పాకిస్థాన్‌ ప్రధాని వ్యంగ్యం

‘ఇండో-అమెరికన్‌ ముస్లిం మహిళ అయిన నబీలా సయ్యద్‌ అను నేను మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్య ర్థిపై విజయం సాధించాను. ఇల్లినాయిస్ జనరల్ అసెంబ్లీకి ఎన్ని కైన వ్య క్తుల్లో నేనే పిన్న వయస్కురాలిని’ అని ఆమె ట్వీట్‌ చేశారు. ప్రజలతో మమేకమవ్వడం తాను విజయం సాధించినట్లు నబీలా సయ్యద్‌ వెల్లడించారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నానని తెలిసినప్పటి నుంచి ప్రజలతో మాట్లాడేందుకు ఎక్కువ సమయం కేటాయించడంతో పాటు ఎన్నికల్లో ఎందుకు పాల్గొంటున్నానో ప్రజలకు వివరించానన్నారు. తనకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Show comments