NTV Telugu Site icon

Indian 2 Juke Box: కమల్ హాసన్, శంకర్‌ల ‘ఇండియన్ 2 ‘ జ్యూక్‌బాక్స్ వచ్చేసిందోచ్..

Indian2

Indian2

చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో కమల్‌హాసన్‌, శంకర్‌ల ఇండియన్‌ 2 ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. తాజాగా మూవీ మేకర్స్ జ్యూక్‌ బాక్స్‌ ను ఆన్‌లైన్‌లో విడుదల చేసారు. దింతో అన్ని ఆడియో ప్లాట్‌ఫారమ్‌ లలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది. ఆల్బమ్‌ లో మొత్తం 6 ట్రాక్‌ లు ఉన్నాయి. కధరాల్జ్, కమ్‌బ్యాక్ ఇండియన్, క్యాలెండర్ సాంగ్, పారా, జగా జగా, నీలోర్పమ్ లు వరుసగా ఇందలో ఉన్నాయి.

Maname: ఏంటి భయ్యా.. ఒక్క సినిమాలో 16 పాటలు..

సినిమా మొదటి నుండి, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మరోసారి అదిరిపోయే ఆల్బమ్‌ను అందించినట్లు కనిపిస్తోంది. పారా, కమ్‌బ్యాక్ ఇండియన్ ఆల్బమ్ నుండి అత్యుత్తమ పాటలుగా చెప్పవచ్చు. ఇక పాటలను ఎంతో గ్రాండ్‌ గా చిత్రీకరిస్తాడనే పేరున్న శంకర్., మరి ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి.

Gam Gam Ganesha: మొదటిరోజు డీసెంట్ కలెక్షన్స్ రాబట్టిన గం గం గణేశా.. లెక్కలు ఇలా..

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన భారతీయుడు 2 లో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా, SJ సూర్య, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, బ్రహ్మానందంలు కీలక పాత్రలు పోషించారు. జూలై 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతుంది. చూడాలి మరి మరోసారి భారతీయుడు ఆ రేంజ్ లో మెప్పించనున్నాడో.

Show comments