Site icon NTV Telugu

IND vs BAN: టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

Match

Match

IND vs BAN: ఆసియా కప్ 2023లో సూపర్-4 దశ చివరి మ్యాచ్ లో భాగంగా.. కాసేపట్లో భారత్ – బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ అరంగేట్రం చేసే అవకాశం లభించింది. మరోవైపు ఈ మ్యాచ్ లో ఐదుగురు ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చారు. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సహా వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చినట్లు రోహిత్‌ వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్‌లో భారత జట్టు ఇప్పటికే ఫైనల్‌కు చేరుకోగా.. సెప్టెంబర్ 17న శ్రీలంకతో తలపడనుంది. నిన్న జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో 2 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై శ్రీలంక ఘన విజయం సాధించి.. ఫైనల్ బెర్త్ ను దక్కించుకుంది.

Read Also: iPhone 12 Price: డెడ్ చీప్‌గా ఐఫోన్.. రూ 17,399కే మీ సొంతం!

భారత్ తుది జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ.

బంగ్లాదేశ్ తుది జట్టు:
లిటన్ దాస్ (వికెట్ కీపర్), తంజీద్ హసన్ తమీమ్, అనముల్ హక్, షకీబ్ అల్ హసన్ (వికెట్ కీపర్), తౌహిద్ హృదయ, షమీమ్ హొస్సేన్, మెహదీ హసన్ మిరాజ్, మెహదీ హసన్, నసుమ్ అహ్మద్, తంజీమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్.

Exit mobile version