Site icon NTV Telugu

Womens Asia Cup : కప్‌ మనదే.. ఫైనల్‌లో శ్రీలంకపై భారత్‌ ఘన విజయం

Womens Asia Cup 2022

Womens Asia Cup 2022

షెల్లాట్ వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో మహిళ భారత్ జట్టు సత్తా చాటింది. ప్రత్యర్థి జట్టుపై ఘన విజయం సాధించి మహిళల ఆసియాకప్-2022 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ జట్టు గెలిచి కప్‌ కైవసం చేసుకుంది. తద్వారా 7వ ఆసియాకప్ టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది భారత జట్టు. ఈ మ్యాచ్‌లో మొదట టాస్‌ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే.. భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులకే పరిమితమైంది. 66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

Also Read : King Cobra And Mongoose Massive Fight: నాగుపాము- ముంగీస ఫైటింగ్‌ ఎప్పుడైనా చూశారా..? ఇదిగో మీ కోసం..!

భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన (51) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను పూర్తి చేసింది. ఈ మ్యాచ్లో భారత పేసర్ రేణుకా సింగ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచడం విశేషం. రేణుక తన 4 ఓవర్ల కోటాలో మూడు వికెట్లు పడగొట్టి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి శభాష్‌ అనిపించుకుంది. ఆమెతో పాటు స్పిన్నర్లు రాజేశ్వరీ గైక్వాడ్, స్నేహ రాణా చెరో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో రణి సింఘే (13), రణవీర(18) మినహా మిగితా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లనే సాధించారు.

 

Exit mobile version