IND vs AUS: విశాఖలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యాన్ని.. టీమిండియా 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ .. నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్(110) శతకం సాధించినప్పటికీ వృధా అయిపోయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో స్టీవ్ స్మిత్ (52), మాథ్యూ షార్ట్ (13), స్టోయినీస్ (7), టిమ్ డేవిడ్ (19) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణకు తలో వికెట్ దక్కింది.
ఈ క్రమంలో 209 పరుగుల భారీ లక్షచేధనకు బరిలోకి దిగిన టీమిండియా.. ఆరంభంలోనే కష్టాల్లో పడింది. 2 ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ (58), సూర్యకుమార్ యాదవ్ (80) ను ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ (12), అక్షర్ పటేల్ (2) పరుగులు చేసి ఔటయ్యారు. కానీ రింకూసింగ్(22) చివరి వరకు ఉండి మ్యాచ్ ను గెలిపించాడు. ఈ మ్యాచ్ లో ముగ్గురు రనౌట్ రూపంలో ఔటయ్యారు. ఇక.. ఆస్ట్రేలియా బౌలర్లలో తన్వీర్ సంఘ 2 వికెట్లు పడగొట్టగా.. జాసన్ బెహ్రెండోర్ఫ్, మాథ్యూ షార్ట్, సీన్ అబాట్ తలో వికెట్ తీశారు.
Read Also: Pooja Hegde: బార్బీ బొమ్మగా మారిన బుట్ట బొమ్మ.. అందరి చూపు అక్కడేనమ్మ