NTV Telugu Site icon

IND vs ZIM: జింబాబ్వేను మడతపెట్టేసిన భారత్.. ఇండియా విక్టరీ

India Won

India Won

జింబాబ్వేతో జరిగిన చివరి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 42 పరుగుల తేడాతో ఇండియా సూపర్ విక్టరీ సాధించింది. టీమిండియా బౌలర్లు మరోసారి అదరగొట్టడంతో గెలుపొందారు. 168 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటింగ్లో డియాన్ మేయర్స్ (34) అత్యధిక పరుగులు చేశాడు. ఆ తర్వాత.. ఫరాజ్ అక్రమ్.. (27) పరుగులు చేశాడు. తడివానాశే మారుమని (27), బ్రియాన్ బెన్నెట్ (10), సికిందర్ రజా (8) పరుగులు చేశారు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ 4 వికెట్లతో చెలరేగాడు. శివమ్ దూబేకు 2 వికెట్లు తీశాడు. తుషార్ దేశ్ పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలో వికెట్ సాధించారు. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్ ను భారత్ 4-1తో సొంతం చేసుకుంది.

Read Also: Trump T-shirts: ట్రంప్ దాడిపై “టీ-షర్ట్‌లు”.. ఇంత ఫాస్ట్‌గా ఎలారా..?

కాగా మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 167 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఈ స్కోరును సాధించింది. భారత్ బ్యాటింగ్లో సంజా శాంసన్ (58) పరుగులతో రాణించాడు. రియాన్ పరాగ్ (22) పరుగులతో పర్వాలేదనిపించాడు. యశస్వీ జైస్వాల్ (12), గిల్ (13), అభిషేక్ శర్మ (14) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత శాంసన్ అర్థ సెంచరీ చేసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అతని ఇన్నింగ్స్లో 4 సెక్సులు, 1 ఫోర్ ఉంది. ఆ తర్వాత రియాన్ పరాగ్ 24 బంతుల్లో 22 పరుగులు, శివం దూబే కూడా క్రీజులో ఉన్నంత సేపు (26) రన్స్ చేసి పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత రింకూ సింగ్ (11*), వాషింగ్టన్ సుందర్ (1*) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలింగ్లో ముజారబానీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత సికిందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మావుట తలో వికెట్ తీశారు.

Read Also: Jammu Kashmir: చొరబాటుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదుల హతం..