NTV Telugu Site icon

IND vs BAN: గిల్ శతకం.. భారత్ ఘన విజయం

Ind Won

Ind Won

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో గెలిచింది. 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ (101) సెంచరీతో చెలరేగాడు. దీంతో ఛాంపియ్స్ ట్రోఫీలో భారత్ బోణీ కొట్టింది. భారత్ బ్యాటింగ్‌లో ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (41) పరుగులు చేశాడు. ఆ తర్వాత.. గిల్‌కు తోడుగా కేఎల్ రాహుల్ (41) మంచి భాగస్వామ్యాన్ని అందించాడు. విరాట్ కోహ్లీ (22), శ్రేయస్ అయ్యర్ (15), అక్షర్ పటేల్ (8) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హుస్సేన్ 2 వికెట్లు పడగొట్టగా.. టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమన్ తలో వికెట్ తీశారు.

Read Also: ICC: పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన ఐసీసీ.. కారణమిదే..?

మొదట బ్యాటింగ్‌ చేసినన బంగ్లాదేశ్‌ 49.4 ఓవర్లో 228 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా బ్యాటర్లను టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. మహమ్మద్ షమీ బంగ్లా బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. క్రీజులోకి వచ్చిన వాళ్లు వచ్చినట్టు పెవిలియన్‌కు పంపించాడు. బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో తోహిద్ హ్రిదోయ్, జాకీర్ అలీ జట్టును ఆదుకున్నారు. హ్రిదోయ్ సెంచరీ (100) చేయగా.. జాకీర్ అలీ (68) పరుగులు చేశారు. వీరిద్దరి మధ్య 150 పరుగుల భాగస్వామ్యం ఉంది. బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో తంజీద్ హసన్ (25), రిషద్ హుస్సేన్ (18) పరుగులు చేశారు. నలుగురు బ్యాటర్లు ఏమీ పరుగులు చేయకుండానే డకౌట్ అయ్యారు. భారత్ బౌలర్లలో మహమ్మద్ షమీ 5 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు. కాగా.. టీమిండియా తర్వాత మ్యాచ్ ఆదివారం పాకిస్తాన్‌తో ఉండనుంది.

Read Also: Sambhal Violence : 1000 పేజీల ఛార్జ్ షీట్, ఎస్పీ, ఎంపీతో సహా 79 మంది పేర్లు.. సంభాల్ హింసపై సిట్ నివేదిక