Site icon NTV Telugu

IND vs AFG: తొలి టీ20లో భారత్ బోణీ.. 6 వికెట్ల తేడాతో గెలుపు

Ind Won

Ind Won

అఫ్ఘనిస్థాన్‌ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ గెలుపొందింది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొహాలి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 17.3 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి 159 పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్ లో శివం దూబే అర్ధసెంచరీతో చెలరేగాడు. 60 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా బ్యాటింగ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ రనౌట్ రూపంలో డకౌట్ అయ్యాడు. శుభ్ మాన్ గిల్ 23, తిలక్ వర్మ 26, జితేష్ శర్మ 31, రింకూ సింగ్ 16 పరుగులు చేశారు. అఫ్ఘానిస్తాన్ బౌలింగ్ లో ముజీబ్ రహమన్ 2 వికెట్లు పడగొట్టగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ తీశాడు.

Read Also: Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో మైక్రాన్​ కంపెనీ సీఈవో భేటీ

అంతకుముందు అఫ్ఘానిస్తాన్ బ్యాటింగ్ లో గుర్బాజ్ 23, ఇబ్రహీం జర్దాన్ 25, అజ్మతుల్లా 29, రహ్మత్ 3, మహ్మద్ నబీ 42, నజీబుల్లా 19, కరీం జనత్ 9 పరుగులు చేశారు. ఇక భారత్ బౌలింగ్ లో ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు పడగొట్టారు. శివం దూబే ఒక వికెట్ తీశాడు. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా.. భారత్ తొలి మ్యాచ్ గెలిచింది. ఇక రెండో టీ20 మ్యాచ్ ఈనెల 14న ఇండోర్ లో జరగనుంది.

Read Also: Hanuman Review: హనుమాన్ రివ్యూ.. గూజ్ బంప్స్ గ్యారెంటీ ఫిల్మ్

Exit mobile version