Site icon NTV Telugu

ICC U19 Women’s T20 WC 2025: టీ 20 ప్రపంచ కప్ కోసం భారత మహిళల జట్టు ప్రకటన..

Icc U 19

Icc U 19

ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ 2025 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. బీసీసీఐ మహిళల సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. భారత మహిళల అండర్-19 జట్టుకు నిక్కీ ప్రసాద్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. వైస్ కెప్టెన్‌గా సానికా చాల్కే వ్యవహరించనుంది. ఈ టోర్నమెంట్ 18 జనవరి 2025 నుండి 2 ఫిబ్రవరి 2025 వరకు మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరుగుతుంది. కాగా.. ఆసియా కప్ విజేత జట్టులో ఉన్న 14 మంది ఆటగాళ్లను జట్టులో ఉంచారు. ఒకే ఒక్క మార్పు ఫాస్ట్ బౌలర్ వైష్ణవి ఎస్ స్థానంలో నందన ఎస్ ను తీసుకున్నారు. అలాగే.. జట్టులో కమలిని జి, భావికా అహిరే రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లు ఉండగా.. ముగ్గురు స్టాండ్‌బై ప్లేయర్లు నందన ఎస్, ఇరా జె, అనాది టి కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు.

డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌, మలేషియా, వెస్టిండీస్, శ్రీలంక గ్రూప్-ఎలో ఉన్నాయి. జనవరి 19న కౌలాలంపూర్‌లో వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతి 4 గ్రూపులలో 4 జట్లు ఉంటాయి. ప్రతి గ్రూప్‌లోని టాప్‌లో ఉన్న జట్లు సూపర్ సిక్స్‌కు చేరుకుంటాయి. సూపర్ సిక్స్ దశలో ఉన్న జట్లను రెండు గ్రూపులుగా చేర్చారు. మొదటి గ్రూప్‌లో గ్రూప్ A, D జట్లు ఉంటాయి. గ్రూప్ 2- B, C జట్లు ఉంటాయి. ప్రతి జట్టు ఇతర గ్రూపులోని జట్టుతో తలపడుతుంది. అర్హత సాధించిన జట్టుతో 2 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత.. సూపర్ సిక్స్ గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు జనవరి 31న జరగాల్సిన సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 2 న జరుగుతుంది.

Read Also: iPhone: ఐఫోన్ ఈ మోడల్స్‌పై ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపు.. డిటేల్స్ ఇవే..!

2025లో జరిగే ప్రపంచ కప్‌లో పాల్గొనే జట్లు (ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్) ఈ పోటీలో పాల్గొంటుడగా.. మలేషియా నేరుగా ప్రవేశించింది. అలాగే.. నేపాల్, నైజీరియా, సమోవా, స్కాట్లాండ్, యునైటెడ్ స్టేట్స్ ప్రాంతీయ టోర్నమెంట్‌లను గెలుచుకోవడంతో పోటీలో తమ స్థానాలను ఖాయం చేసుకున్నాయి.

U19 మహిళల T20 WC 2025 కోసం భారత జట్టు:
నిక్కీ ప్రసాద్ (కెప్టెన్), సానికా చాల్కే (వైస్ కెప్టెన్), జి. త్రిష, కమలిని. జి (వికెట్ కీపర్), భావికా అహిర్ (వికెట్ కీపర్), ఈశ్వరి అవసరే, మిథిలా వినోద్, జోషితా విజె, సోనమ్ యాదవ్, పరిణీత సిసోడియా, కేసరి దృష్టి, ఆయుషి శుక్లా, ఆనందిత కిషోర్, MD షబ్నం, వైష్ణవి.
రిజర్వ్ ప్లేయర్లు: నంధన, ఇరా జె, అనాది. టి.

Exit mobile version