Asian Games 2023: ఆసియా గేమ్స్ సెమీస్ చేరిన భారత జట్టు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian womens Cricket Team Entered Semi Finals of Asian Games 2023: చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2023 సెమీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అడుగుపెట్టింది. గురువారం భారత్-మలేషియా జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో భారత్ సెమీస్ చేరింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో.. ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. అయితే మలేషియా కంటే భారత ర్యాంక్ (టాప్ సీడ్) మెరుగ్గా ఉండడంతో.. స్మృతీ మంధాన సేన సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. సెప్టెంబర్ 24న సెమీఫైనల్ 1లో పాకిస్తాన్‌తో భారత్ తలపడే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మలేషియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 173 స్కోరు చేసింది. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ (67), జెమిమా రోడ్రిగ్స్ (47 నాటౌట్), స్మృతీ మంధాన (27), రిచా ఘోష్ (21 నాటౌట్) రాణించారు. మలేషియా బౌలర్లు ఇజ్జతీ ఇస్మాయిల్, మాస్ ఎలీసా చెరో వికెట్ పడగొట్టారు. భారత్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం పడడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. వర్షం తగ్గుముఖం పట్టాక మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు.
Also Read
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- 11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
Also Read: Khalistani Terrorist: కెనడాలో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడి హత్య.. భారత్‌లో పలు క్రిమినల్ కేసులు!
అనంతరం మలేషియా ఇన్నింగ్స్ ఆరంభంలోనే మళ్లీ వర్షం పడింది. మలేషియా ఇన్నింగ్స్‌లో కేవలం రెండు బంతులు మాత్రమే పడ్డాయి. వర్షం ఎంతకీ తగ్గుముఖం పట్టకపోవడంతో.. అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. టాప్ సీడ్‌తో ఆసియా గేమ్స్ బరిలోకి దిగిన భారత్.. వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దైనా సెమీస్‌కు చేరింది. ఇక ఆదివారం జరగనున్న తొలి సెమీస్‌లో భారత్ గెలిస్తే పతకం ఖాయం అవుతుంది. భారత పురుషుల జట్టు తొలిసారి ఆసియా గేమ్స్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. పురుషుల క్రికెట్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమవుతాయి.
Rain 🌧️ has the final say after India’s terrific batting display!
India march to the semifinals in the #AsianGames 👏👏
Scorecard ▶️https://t.co/c5tw7bD88x#IndiaAtAG22 pic.twitter.com/Wrb3GeAStw
— BCCI Women (@BCCIWomen) September 21, 2023
తాజావార్తలు
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
-
Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
-
PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!