Asian Games 2023: భారత్ ఖాతాలో మరో రజతం.. 16కు చేరిన మొత్తం పతకాల సంఖ్య!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Wins Silver Medal in Asian Games 2023: హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. బుధవారం భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం (3 పొజిషన్స్)లో భారత మహిళా జట్టు రజతం (సిల్వర్ మెడల్) సాధించింది. భారత షూటింగ్ త్రయం సిఫ్ట్‌కౌర్ సమ్రా, మనిని కౌశిక్, ఆషి చోక్సీ అద్భుత ప్రదర్శనతో భారత్‌కు రజతం దక్కింది. అదే సమయంలో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాల అర్హతలో సిఫ్ట్‌కౌర్ రెండవ స్థానంలో, చోక్సీ ఆరో స్థానంలో నిలిచారు.
బుధవారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ విభాగంలో చైనా జట్టు స్వర్ణ పతకం సాధించింది. చైనా 1773 పాయింట్లు సాధించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. చైనా కంటే 9 పాయింట్లు వెనుకబడిన భారత జట్టు 1764 స్కోరుతో రజతం సాధించింది. రిపబ్లిక్ ఆఫ్ కొరియా 1756 స్కోరు సాధించి.. మూడో స్థానములో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకుంది.
Also Read
- IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్‌పై భారత్ 19-0తో సంచలన విజయం.!
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
- iPhone Duo vs Galaxy Z Fold 8.. స్లిమ్ డిజైన్, కెమెరా, బ్యాటరీ, ధర, ఫీచర్లలో ఏది బెస్ట్? ఫుల్ క్లారిటీ ఇదిగో..
- YS Jagan: పరీక్ష లేకుండానే 372 ఉద్యోగాలు.. ఆ తర్వాత జీవోలు ఎందుకు మార్చారు?
Also Read: IND vs AUS 3rd ODI: ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. ప్రపంచ రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ!
భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 25 మీటర్ల పిస్టల్ టీమ్ గోల్డ్ మెడల్ సాధించింది. భారత షూటర్లు మనూ బాకర్, రిథం సంగ్వాన్, ఇషా సింగ్ భారత్ ఖాతాలో పసిడి చేర్చారు. నాలుగో రోజు పతకాలు కలుపుకుని భారత్ పతకాల సంఖ్య 16కు చేరింది. భారత క్రీడాకారులు ఇప్పటివరకు నాలుగు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఏడు కాంస్యాలు సాధించారు.
🥈🇮🇳 Team India Shines Bright 🇮🇳🥈
Incredible marksmanship on display! 🎯👏
Congratulations to our phenomenal trio, @SiftSamra, Manini Kaushik, and Ashi Chouksey, on their stellar performance in the 50m Rifle 3 Positions Women’s Team event! 🥈👩🎯
Very well done, girls!!… pic.twitter.com/wTC9e3XwVz
— SAI Media (@Media_SAI) September 27, 2023
తాజావార్తలు
-
IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్‌పై భారత్ 19-0తో సంచలన విజయం.!
-
Tirupati – Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
-
iPhone Duo vs Galaxy Z Fold 8.. స్లిమ్ డిజైన్, కెమెరా, బ్యాటరీ, ధర, ఫీచర్లలో ఏది బెస్ట్? ఫుల్ క్లారిటీ ఇదిగో..
-
CM Vijay vs MK Stalin: ‘అసెంబ్లీని రీల్స్ చేసే వేదికగా మార్చొద్దు’.. సీఎం విజయ్‌పై స్టాలిన్ విమర్శలు
-
YS Jagan: పరీక్ష లేకుండానే 372 ఉద్యోగాలు.. ఆ తర్వాత జీవోలు ఎందుకు మార్చారు?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?