Suryakumar Yadav: ధోని సరసన సూర్య.. రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav: భారత్ తన ఖాతాలో మరో టీ20 వరల్డ్ కప్పును వేసుకుంది. అహ్మదాబాద్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో ఘన విజయం సాధించింది. క్రికెట్ ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. భారతదేశానికి ఈ ట్రోఫీని అందించిన మూడో కెప్టెన్‌గా నిలిచాడు. అంతేకాదు, తన మొదటి వరల్డ్ కప్‌లోనే కెప్టెన్‌గా టైటిల్ గెలిచి ఎంఎస్ ధోని సరసన నిలిచి, రోహిత్ శర్మ కంటే ఒక అడుగు ముందుకేశాడు. ఇక టీ20 క్రికెట్లో పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సూర్యకు పరాజయం కలగలేదు. ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందు సూర్య రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఫైనల్ మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ స్పందించాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జర్నలిస్ట్ అడిగిన రిటైర్మెంట్ ప్రశ్నకు నవ్వుతూ సరదాగా సమాధానం ఇచ్చాడు. “ఇప్పుడే రిటైర్మెంట్ గురించి ఎందుకు ఆలోచించాలి? అన్నీ బాగానే సాగుతున్నాయి కదా” అని చెప్పి ఆ ఊహాగానాలకు బ్రేక్ వేశాడు. అంటే ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు.
READ MORE: మార్చి 28న ప్రారంభం కానున్న IPL 2026.. త్వరలో పూర్తి షెడ్యూల్ విడుదల.!
Also Read
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- Team India: భారత టీ20 జట్టులో మార్పులు.. ఐదో టీ20కి సంజూ శాంసన్ ఎంట్రీ..? టీం నుంచి ఇద్దరు అవుట్..
- O Sukumari: ముట్టుకుంటే షాక్ కొట్టే పెళ్లాం.. తిరువీర్ తిప్పలు చూస్తే నవ్వాపుకోలేరు!
- China: ప్రపంచంలోనే తొలిసారి.. సముద్రంలోని వలలో రాకెట్‌ను దించిన చైనా!
ఇదిలా ఉండగా.. గత 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచాక టీమ్‌లో అనేక మార్పులు వచ్చాయి. ఆ టోర్నీ అనంతరం సీనియర్ ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పారు. దీంతో కొత్త తరహా టీమ్ నిర్మాణం ప్రారంభమైంది. ఆ కొత్త జట్టును ముందుండి నడిపిస్తూ సూర్యకుమార్ యాదవ్ విజయం సాధించడం అభిమానుల్లో కొత్త నమ్మకాన్ని పెంచింది. అయితే.. తాజాగా తన భవిష్యత్ లక్ష్యాల గురించి సూర్యకుమార్ స్పష్టంగా చెప్పాడు. తన దృష్టి ఇప్పుడు మరో పెద్ద గమ్యంపై ఉందని వెల్లడించాడు. ముఖ్యంగా క్రికెట్‌కు ఒలింపిక్స్‌లో చోటు దక్కనున్న నేపథ్యంలో భారత జట్టుకు ఒలింపిక్ మెడల్ సాధించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపాడు. అంతేకాకుండా వచ్చే ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2028 పై తన దృష్టి ఉందని పేర్కొన్నాడు.
READ MORE: Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో నిర్మాణాలు తొలగించాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి
తాజావార్తలు
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
-
IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
-
Team India: భారత టీ20 జట్టులో మార్పులు.. ఐదో టీ20కి సంజూ శాంసన్ ఎంట్రీ..? టీం నుంచి ఇద్దరు అవుట్..
-
Bhatti Vikramarka : బీఆర్ఎస్ మాయమాటలు నమ్మొద్దు..
-
O Sukumari: ముట్టుకుంటే షాక్ కొట్టే పెళ్లాం.. తిరువీర్ తిప్పలు చూస్తే నవ్వాపుకోలేరు!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!