Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీమిండియా
- దివ్యాంగ క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీమిండియా.
- ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 79 పరుగుల తేడాతో ఘన విజయం.
- క్రికెట్ ఆడాలని కలలు కన్న ప్రతి దివ్యాంగుడి గౌరవంగా నిలుస్తుందన్న DCCI.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champions Trophy 2025: శ్రీలంకలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత దివ్యాంగ క్రికెట్ టీమ్ అద్భుత విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు, టోర్నమెంట్ విజేతగా నిలిచింది. భారత దివ్యాంగ క్రికెట్ కౌన్సిల్ (DCCI) ఈ గెలుపును అధికారికంగా ప్రకటిస్తూ.. జట్టు సమిష్టి కృషిని కొనియాడింది. ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఇంగ్లండ్ జట్టు లక్ష్య ఛేదనలో చేతులెత్తేసి 118 పరుగులకే ఆలౌటైంది. భారత ఆటగాడు యోగేంద్ర భదోరియా ఫైనల్లో విధ్వంసం సృష్టించాడు. అతను నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో కేవలం 40 బంతుల్లో 73 పరుగులు చేసి ఇంగ్లండ్ బౌలర్లను బాదేశాడు. భారత బౌలర్లు తమ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ జట్టును సమూలంగా దెబ్బతీశారు. రాధికా ప్రసాద్ 3.2 ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. కెప్టెన్ విక్రాంత్ కేనీ రెండు వికెట్లు తీయగా, రవీంద్ర సంటే రెండు వికెట్లు తీసి విజయానికి తోడ్పడ్డాడు.
Also Read: Top Headlines @9AM: టాప్ న్యూస్!
Also Read
- Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
ఇక మ్యాచ్ తర్వాత కెప్టెన్ విక్రాంత్ కేనీ మాట్లాడుతూ.. “ఈ గెలుపు నా కెరీర్‌లో గర్వకారణం. జట్టులో ప్రతి ఆటగాడి కృషి ఈ చారిత్రాత్మక విజయానికి దోహదపడింది” అని ఆయన తెలిపారు. ఇక జట్టుపై ప్రధాన కోచ్ ప్రశంసలు కురిపించారు. జట్టు ప్రధాన కోచ్ రోహిత్ జలానీ, తన జట్టు అసాధారణ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. ప్రతి పరిస్థితిని అధిగమిస్తూ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని, ఈ విజయంతో భారత దివ్యాంగ క్రికెట్ జట్టు కొత్త ఎత్తులకు చేరుకుందని కోచ్ అన్నారు.”ఈ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం, భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఇది భారతదేశం తరపున క్రికెట్ ఆడాలని కలలు కన్న ప్రతి దివ్యాంగుడి గౌరవంగా నిలుస్తుంది” అని DCCI ప్రకటించింది. ఈ అద్భుత గెలుపుతో భారత దివ్యాంగ క్రికెట్ జట్టు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది.
తాజావార్తలు
-
Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
-
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!