NTV Telugu Site icon

Archery World Cup 2024: ఒలింపిక్ ఛాంపియన్‌ను ఓడించి.. స్వర్ణ పతకం కైవసం చేసుకున్న భారత్!

India Archery World Cup 2024

India Archery World Cup 2024

ఆర్చరీ ప్రపంచ కప్ 2024లో భారత్ మరో స్వర్ణ పతకంను కైవసం చేసుకుంది. షాంఘైలో జరుగుతున్న ప్రపంచకప్ స్టేజ్ 1లో భారత పురుషుల ఆర్చరీ జట్టు.. ఒలింపిక్ ఛాంపియన్ దక్షిణ కొరియాను ఓడించి రికర్వ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది. ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్‌ రాయ్, ప్రవీణ్‌ జాదవ్‌తో కూడిన భారత జట్టు 5-1 తేడాతో (57-57, 57-55, 55-53) దక్షిణ కొరియాను ఓడించింది.

Also Read: Rishabh Pant: దాని వల్ల ప్రతి రోజూ గండమే: రిషబ్ పంత్

ఆర్చరీ ప్రపంచ కప్ 2024లో భారత్‌కు ఇది ఐదవ స్వర్ణం. ఇప్పటికే కాంపౌండ్‌ విభాగంలో మూడు, వ్యక్తిగత విభాగంలో ఒక స్వర్ణాన్ని భారత్ గెలుచుకుంది. ఈ ఈవెంట్‌లో మొత్తంగా భారత్ ఆరు పతకాలను దక్కించుకుంది. ఇందులో ఐదు స్వర్ణాలు ఉండగా.. ఒకటి రజతం ఉంది. ఇక మహిళల వ్యక్తిగత రికర్వ్‌ సెమీ ఫైనల్లో దీపిక దక్షిణ కొరియాకు చెందిన ప్రత్యర్థిని ఢీకొట్టనుంది. మిక్స్‌డ్ టీమ్‌ కూడా రికర్వ్‌ విభాగంలో కాంస్య పతకం కోసం పోటీ పడనుంది. తెలుగమ్మాయి జ్యోతి వ్యక్తిగత ఫైనల్లో టాప్‌ సీడ్‌ ఆండ్రియా బెకెరా (మెక్సికో)ను ఓడించిన విషయం తెలిసిందే.

Show comments