Gaza Ceasefire: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారతదేశం స్వాగతించింది. ఒప్పందం తర్వాత గాజాలో శాంతి, మానవతా సహాయం పెరుగుతాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. గాజాలో బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటనను స్వాగతిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది గాజా ప్రజలకు సురక్షితమైన, నిరంతర మానవతా సహాయం అందించడానికి దారి తీస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. అన్ని రకాల బందీల విడుదల, కాల్పుల విరమణ, సంభాషణలు, దౌత్య మార్గానికి తిరిగి రావాలని నిరంతరం పిలుపునిచ్చామని తెలిపింది.
Also Read: Fishermen Released: శ్రీలంక జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు
మొదట అక్టోబర్ 7, 2023న, హమాస్ ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాలను హమాస్ లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో దాదాపు 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. అంతే కాకుండా 250 మందిని బందీలుగా పట్టుకున్నారు. దీని తర్వాత ఇజ్రాయెల్ గాజాపై దాడి చేయడం ప్రారంభించింది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఇప్పటివరకు 45 వేల మందికి పైగా పాలస్తీనా పౌరులు మరణించారు. ఈ నేపథ్యంలోనే గాజాలోని పెద్ద ప్రాంతాలు శిథిలావస్థకు చేరాయి. గాజాలో ఉన్న 23 లక్షల జనాభాలో ఇప్పుడు ఏకంగా 90 శాతం మంది నిర్వాసితులయ్యారు. అలాగే చాలామంది ప్రజలు ఆకలి చావులు ఎదుర్కొంటున్నారు.
https://twitter.com/MEAIndia/status/1879752154661171615
Also Read: ISRO: కొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో.. డాకింగ్ ప్రక్రియ విజయవంతం
ఖతార్ రాజధానిలో వారాల తరబడి గట్టి చర్చల అనంతరం కుదిరిన ఒప్పందంలో పలు షరతులను విధించారు. బందీలుగా ఉన్న డజన్ల కొద్దీ వ్యక్తులను దశలవారీగా విడుదల చేసేందుకు హమాస్ అంగీకారం తెలిపింది. వందలాది మంది పాలస్తీనా ఖైదీలను తన చెర నుంచి విడుదల చేసేందుకు కూడా ఇజ్రాయెల్ అంగీకరించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మాట్లాడుతూ.. 8 నెలల నిరంతర చర్చల తర్వాత కాల్పుల విరమణ, బందీల ఒప్పందాన్ని అంగీకరించడంలో పరిపాలన విజయం సాధించింది. ఈ ఒప్పందం మూడు దశల్లో అమలు కానుంది. ఈ ఒప్పందం జనవరి 19, 2025 నుండి అమలులోకి వస్తుంది. ఈ పక్రియను మొత్తం మూడు దశల్లో శాంతిని తీసుకురావాలని యోచిస్తోంది. ఈ ప్రక్రియను విజయవంతం చేసేందుకు ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పని చేస్తామని ఈ దేశాలు హామీ ఇచ్చాయి.
