New Players: టీమిండియాలోకి ముగ్గురు కొత్త యువ ఆటగాళ్లు.. మొదటిసారి టీ20 జట్టులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టు జూలై 23 నుండి జింబాబ్వేతో జరగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సరికొత్త జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, జట్టులో పలువురు యువ ఆటగాళ్లకు తొలిసారిగా చోటు దక్కింది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు యశ్ ఠాకూర్, అశోక్ శర్మతో పాటు స్పిన్నర్ హర్ష్ దూబే మొదటిసారి భారత టీ20 జట్టులోకి ఎంపికయ్యారు.
అయితే.. ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తరఫున కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడి, 55 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టిన యశ్ ఠాకూర్ ఎంపికపై టీమిండియా సీనియర్ బ్యాటర్ హనుమ విహారి తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సెలెక్టర్లు మళ్లీ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని విహారి అభిప్రాయపడ్డారు.
Also Read
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
- Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
- Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
కేవలం యశ్ ఠాకూర్ మాత్రమే కాకుండా.. ఫాస్ట్ బౌలర్ మయంక్ యాదవ్ ఎంపికను కూడా విహారి తప్పుబట్టారు. గతంలో 156.7 కిమీ వేగంతో బౌలింగ్ చేసిన మయంక్ యాదవ్, ఐపీఎల్ 19వ సీజన్లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదని, పైగా అతను తరచూ గాయాల బారిన పడుతుంటాడని గుర్తుచేశారు. ప్రస్తుతం అతను 150 కిమీ వేగంతో కూడా బౌలింగ్ చేయడం లేదని, ఐపీఎల్లో కనీసం ప్లేయింగ్ ఎలెవన్‌లో లేని ఆటగాళ్లను భారత జట్టులోకి ఎలా ఎంపిక చేస్తారని విహారి ప్రశ్నించారు.
దీనిపై బిసిసిఐ వర్గాలు స్పందిస్తూ… మయంక్ యాదవ్, అశోక్ శర్మలు దేశంలోనే అత్యంత వేగవంతమైన యువ బౌలర్లని, జింబాబ్వే లాంటి జట్లపై కాకపోతే మరి ఎక్కడ వారిని పరీక్షిస్తామని సమర్థించుకున్నాయి. అలాగే ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుతంగా రాణించిన ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను సంజూ శాంసన్ స్థానంలో వికెట్ కీపర్-బ్యాటర్‌గా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్న ఆరుగురు ఆటగాళ్లలో శాంసన్ ఒకరిగా ఉన్నందున అతడిని ఎంపిక చేయలేదని తెలుస్తోంది.
జింబాబ్వే టీ20 సిరీస్ కోసం భారత స్క్వాడ్..
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, సూర్యాంశ్ శెడ్గే, రింకూ సింగ్, మయంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ.
తాజావార్తలు
-
Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
-
Income Tax Jobs 2026: 10th, ఇంటర్ అర్హతతో.. ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, MTS పోస్టులు
-
AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
-
TDP : గుంటూరు మేయర్ పీఠంపై టీడీపీ ఫోకస్.. బరిలోకి లక్ష్మీ అపర్ణ..
-
Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!