NTV Telugu Site icon

IND vs SL: టాస్‌ గెలిచిన శ్రీలంక.. బ్యాటింగ్ చేయనున్న భారత్

Ind Vs Sl

Ind Vs Sl

IND vs SL: ఇండియా, శ్రీలంక జట్ల మధ్య 3 టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఈ రోజు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఇరు జట్ల కెప్టెన్లు కొత్తవారే. ఈ పరిస్థితిలో సూర్యకుమార్ యాదవ్, చరిత్ అసలంక విజయంతో సిరీస్‌ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు. కెప్టెన్‌లు మాత్రమే కాకుండా ఇరు జట్ల కోచ్‌లు కూడా కొత్తవారే. భారత జట్టు హెడ్‌గా గౌతమ్ గంభీర్, శ్రీలంక తాత్కాలిక హెడ్‌గా సనత్ జయసూర్య నియమితులయ్యారు. శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేయనుంది.

భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న టీ20ల్లో గణాంకాలను పరిశీలిస్తే.. భారత జట్టుదే పైచేయి. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 29 మ్యాచ్‌లు జరిగాయి. భారత జట్టు 19 మ్యాచ్‌లు గెలిచింది. దీంతోపాటు 9 మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఓటమిని చవిచూసింది. రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ టైగా నిలిచింది. పల్లెకెలె స్టేడియంలో ఇరు జట్ల మధ్య 1 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. శ్రీలంకలో ఇరు జట్ల మధ్య 8 టీ20లు జరిగాయి. భారత జట్టు 5, శ్రీలంక 3 కైవసం చేసుకున్నాయి.

Read Also: Sunitha Krishnan: బాలీవుడ్ వాళ్లు బయోపిక్ రెడీ చేసినా నేను నో చెప్పా!

శ్రీలంక జట్టు ఇదే..
అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, దినేష్ చండిమల్, వనిందు హసరంగా, దసున్ షనక, మతిషా పతిరణ, మహేష్ తీక్షణ, దునిత్ వెలెజ్, బినుర ఫెర్నాండో.

భారత జట్టు ఇదే..
యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.