IND vs PAK U19 Asia Cup Final: భారత్ ముందు భారీ టార్గెట్.. పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan U19 Asia Cup Final 2026: అండర్-19 ఏషియా కప్ 2026 ఫైనల్లో భారత్, పాకిస్థాన్ (Pakistan) జట్లు తలపడుతున్నాయి. ఒమన్‌లోని అల్ అమెరాత్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు భారత్‌కు 338 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాన్ సెంచరీతో రాణించాడు. ఇప్పుడు అందరి చూపు టీమిండియా ఓపెనర్, వీరేంద్ర సెహ్వాగ్ కొడుకైన ఆర్యవీర్ సెహ్వాగ్ (Aryavart Sehwag) పైనే ఉంది.
పాకిస్థాన్ బ్యాటింగ్ (Batting) విషయానికి వస్తే.. ఓపెనర్లు ఉస్మాన్ ఖాన్, హయామ్ ఖాన్ మొదటి వికెట్‌కు 62 పరుగులు జోడించారు. 21 పరుగులు చేసిన హయామ్ను కావ్యా పటేల్ అవుట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అబ్దుల్ ఖాదిర్‌తో కలిసి ఉస్మాన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 135 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని (Partnership) నెలకొల్పారు. అబ్దుల్ ఖాదిర్ కేవలం 54 బంతుల్లోనే 80 పరుగులు బాదేయగా, అందులో 8 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. ఇతని వికెట్‌ను అర్జున్ రాజ్‌పుత్ పడగొట్టాడు. మరోవైపు ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 111 బంతులు ఎదుర్కొన్న ఉస్మాన్.. 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 107 పరుగులు చేసి మెరిశాడు. ఇతని వికెట్‌ను కూడా కావ్యా పటేలే తీశాడు. భారత బౌలర్లలో కావ్యా పటేల్ 4, చిగురుపాటి వెంకట 3, అర్జున్ రాజ్‌పుత్ ఒక వికెట్ తీశారు.
Also Read
- Vastu Tips: ఇంట్లో పొరపాటున కూడా ఈ 3 మొక్కలను పెంచకండి.. దరిద్రం వెంటాడుతుంది!!
- Shreyas Iyer: అత్యంత చెత్త రికార్డు..! కోహ్లీ, గిల్ సరసన శ్రేయస్ అయ్యర్!
- EPFO Alert: ప్రైవేట్ ఉద్యోగులూ తెలుసుకోండి.. PF విషయంలో EPFO కొత్త అప్డేట్.. డెడ్‌లైన్ ఇదే..!
- Rahul Gandhi: గిగ్ వర్కర్ల బాధ నాకు తెలుసు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
ఇక, ఈ టోర్నమెంట్లో భారత్ అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ (Final) చేరింది. సెమీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టును 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. మరోవైపు పాకిస్థాన్ జట్టు సెమీ-ఫైనల్ (Semi-final) మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 9 వికెట్లతో ఘన విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్ (Group stage) మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ప్లేయర్స్ పక్కా వ్యూహంతో బరిలోకి దిగారు. ఇప్పటివరకు భారత్ 8 సార్లు ఈ అండర్-19 ఏషియా కప్ టైటిల్‌ను (Title) కైవసం చేసుకోగా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు రెండేసి సార్లు గెలిచాయి. ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ కూడా ఛాంపియన్‌గా (Champion) నిలిచింది.
తాజావార్తలు
-
IND vs PAK U19 Asia Cup Final: భారత్ ముందు భారీ టార్గెట్.. పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్!!
-
Vastu Tips: ఇంట్లో పొరపాటున కూడా ఈ 3 మొక్కలను పెంచకండి.. దరిద్రం వెంటాడుతుంది!!
-
Rowdy Janardhana: విజయ్, సూర్య కాదు.. ‘రౌడీ జనార్ధన’లో మలయాళ స్టార్!
-
Shreyas Iyer: అత్యంత చెత్త రికార్డు..! కోహ్లీ, గిల్ సరసన శ్రేయస్ అయ్యర్!
-
IND vs NZ Test: టెస్ట్ స్క్వాడ్‌లోకి యువ పేసర్.. కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు తప్పించారంటే?
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!