ICC T20 World Cup: వామ్మో.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను ఇంత మంది చూశారా! షాకింగ్ రిపోర్ట్

India Vs Pakistan T20 Match

India Vs Pakistan T20 Match

ICC T20 World Cup: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో అత్యంత చర్చనీయాంశమైన అంశం భారత్-పాకిస్థాన్ మ్యాచ్. మ్యాచ్ జరగడానికి ముందు అనేక రాజకీయ పరిణామాలు, బహిష్కరణ బెదిరింపులు చోటుచేసుకున్నాయి. కానీ, చివరకు మ్యాచ్ మొదలయ్యాక మైదానంలో పరుగుల వరదతో పాటు.. అటు ఇంటర్నెట్‌లో రికార్డుల వరద పారింది. నిజానికి దాయాదుల మధ్య జరిగిన ఈ పోరు కాసుల వర్షం కురిపించింది. ఈ మ్యాచ్ ద్వారా ఎన్ని వేల కోట్ల ఆదాయమో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. ఇంతకీ ఈ ఒక్క మ్యాచ్ ద్వారా ఎన్ని వేల కోట్ల ఆదాయం వచ్చిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Iftar Recipes: రంజాన్ స్పెషల్.. ఈసారి ఇఫ్తార్ లో ఈ వంటకాలను ట్రై చేయండి.!

×
×
Ad

మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కొన్ని షరతులు పెట్టింది. ఒక దశలో పాక్ జట్టు అసలు ఆడదేమో అనిపించింది. కానీ, ఐసీసీ (ICC) జోక్యంతో ఉత్కంఠ వీడి, కొలంబో వేదికగా దాయాదుల మధ్య పోరు మొదలైంది. ఈ టెన్షన్ వల్లే మ్యాచ్‌పై జనాల్లో విపరీతమైన ఆసక్తి పెరిగింది. భారతదేశంలో అధికారిక స్ట్రీమింగ్ భాగస్వామి అయిన జియోహాట్‌స్టార్ ద్వారా ఈ మ్యాచ్ కళ్లు చెదిరే గణాంకాలను నమోదు చేసింది. ఈ మ్యాచ్‌ను డిజిటల్‌లో ఏకంగా 16.3 కోట్ల మంది వీక్షించారు. ఇది ఏ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌కైనా ఒక రికార్డ్ అని జియోహాట్‌స్టార్ వెల్లడించింది. 2024లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్ కంటే ఈసారి 56% ఎక్కువ మంది వీక్షించారు. ప్రజలు ఈ మ్యాచ్‌ను అన్ని రకాల స్క్రీన్లలో (మొబైల్, టీవీ) కలిపి మొత్తం 20 బిలియన్ నిమిషాల పాటు చూశారు. అంటే మునుపటి కంటే ఇది 42% ఎక్కువ. ఈ మ్యాచ్‌ను కేవలం స్మార్ట్ ఫోన్లలోనే కాదు, టీవీల్లో కూడా కోట్ల మంది చూశారు. దీంతో టీవీలో ఈ మ్యాచ్‌కు 71% రేటింగ్ పెరిగింది. 2021 తర్వాత అత్యధిక రేటింగ్ వచ్చిన మ్యాచ్ ఇదేనంట.

ఈ ఉత్కంఠభరిత పోరులో భారత్ 61 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. దీనితో టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ రికార్డు 8-1కి చేరుకుంది. అంటే ఇప్పటివరకు జరిగిన 9 మ్యాచ్‌ల్లో భారత్ 8 సార్లు గెలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ సందర్భంగా జియోస్టార్ ప్రతినిధులు సిద్ధార్థ్ శర్మ, అనుప్ గోవిందన్ మాట్లాడుతూ.. “ఈ మ్యాచ్ కోసం జరిగిన హంగామా, చివరకు ఆడిన తీరు అభిమానులను కట్టిపడేశాయి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ పట్ల ఉన్న మక్కువకు ఈ రికార్డులే నిదర్శనం” అని పేర్కొన్నారు.

READ ALSO: DGCA New Rules: ఇకపై విమానంలో ‘వీరంగాలు’ చెల్లవ్.. బాసు కొత్త రూల్స్ తెలుసా!