India vs Pakistan: జస్ప్రీత్ బుమ్రాకు సర్‌ప్రైజ్ గిప్ట్ ఇచ్చిన పాక్ పేసర్.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shaheen Afridi gave Jasprit Bumrah a gift in Colombo on India vs Pakistan Match: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు పాకిస్థాన్ యువ పేస్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది సర్‌ప్రైజ్ గిప్ట్ ఇచ్చాడు. ఇటీవల తండ్రైన బుమ్రాకు అఫ్రిది గిప్ట్ ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశాడు. బాబు క్షేమ సమాచారం అడిగిన అనంతరం ఒకరినొకరు కౌగలించుకుని వెళ్లిపోయారు. ఆసియా కప్ 2023లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య సూపర్-4 మ్యాచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జస్ప్రీత్ బుమ్రా, షాహీన్ షా అఫ్రిదిలకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా తన ఎక్స్‌లో పంచుకుంది. ఈ వీడియోపై ఫాన్స్ రియాక్ట్ అవుతున్నారు. మైదానంలో మాత్రమే పోటీతత్వం ఉండాలని, బయట సోదరభావంతో మెలగాలని కామెంట్లు చేశారు. బుమ్రా భార్య సంజనా గణేశన్ గత వరం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రసవ సమయంలో బుమ్రా తన భార్య పక్కన ఉండేందుకు శ్రీలంక నుంచి ముంబై వచ్చాడు. నేపాల్‌తో మ్యాచ్‌కు దూరమైన బుమ్రా.. పాకిస్థాన్‌తో సూపర్-4కు మ్యాచ్‌కు ముందు అందుబాటులోకి వచ్చాడు.
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్‌లోనూ ఉద్యోగ బాధ్యతలు
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
Also Read: PAK vs IND: సేమ్ సీన్ రిపీట్.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో మళ్లీ ఖాళీ..!
ముందుగా ఊహించినట్టే ఆదివారం భారత్, పాకిస్థాన్ సూపర్-4 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దాంతో రిజర్వ్ డే (సెప్టెంబరు 11)కు మ్యాచ్ వాయిదా పడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 24.1 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 147 రన్స్ చేసింది. ఈ సమయంలో భారీ వర్షం కురవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. అనంతరం వర్షం తగ్గడంతో.. మైదానం సిద్ధం చేస్తుండగా మరోసారి వర్షం వచ్చింది. వర్షం ఇంతకీ తగ్గకపోవడంతో రిజర్వ్ డేకు వాయిదా వేశారు. సోమవారం భారత్ ఇన్నింగ్స్ 24.1 ఓవర్ల నుంచే ప్రారంభమవుతుంది.
Shaheen gifted & congratulated Bumrah for becoming a father.
– A beautiful gesture by Shaheen.pic.twitter.com/zYAFcHk2F9
— Johns. (@CricCrazyJohns) September 10, 2023
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!