Site icon NTV Telugu

India vs Pakistan: “వర్షం పడాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను”.. పాక్ మాజీ ప్లేయర్ మాస్టర్ ప్లాన్..

Basit

Basit

India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై ఎంతో ఉత్కంఠ నెలకొంది. అభిమానులు కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నాయి. సాయంత్రం అన్ని పనులు పక్కన పెట్టి టీవీలకు అతుక్కుపోయేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఈ మ్యాచ్‌కు వర్షం పెద్ద అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం(R. Premadasa Stadium)లో ఆదివారం జరగాల్సిన ఈ హై వోల్టేజ్ పోరుకు ఆకాశం మబ్బులు కమ్ముకుంటున్నాయి. భారీ వర్షం పడే అవకాశం ఉందని శ్రీలంక వాతావరణ శాఖ చెబుతోంది. అక్క్యూవెదర్ ప్రకారం వర్షం పడే అవకాశం 93 శాతం వరకు ఉందంటే పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. మధ్యాహ్నం నుంచి మేఘాలు కమ్ముకుని, చెలరేగే ఈదురుగాలులతో పాటు మెరుపులతో కూడిన వాన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. పగలు 65 శాతం వరకు వర్షం వచ్చే ఛాన్స్ ఉంది. రాత్రికి ఆ శాతం 25కు తగ్గుతుందని చెప్పినా, మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి మళ్లీ 49 నుంచి 65 శాతం వరకు ఉండొచ్చని స్థానిక నివేదికలు చెబుతున్నాయి.

READ MORE: Kotappakonda: కోటప్పకొండకు భక్తుల తాకిడి.. బిందెతీర్థంతో త్రికోటేశ్వరుడికి అభిషేకాలు

ఈ పరిస్థితుల్లో మాజీ పాకిస్థాన్ క్రికెటర్ బసిత్ అలీ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అభిమానులంతా మ్యాచ్ జరగాలని కోరుకుంటే.. ఆయన మాత్రం “వర్షం పడాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని చెప్పాడు. పూర్తి మ్యాచ్ చూడాలనుకుంటున్నారా? అని అడిగిన ప్రశ్నకు “నాకు వర్షమే కావాలి” అని మళ్లీ చెప్పడం చర్చనీయాంశమైంది. ఇలా చెప్పడంలో బలమైన కారణం ఉంది. ఒక వేళ ఈ మ్యాచ్ రద్దయితే పాకిస్థాన్‌కు సూపర్ ఎయిట్ (Super 8) దారి సులభమవుతుంది. టీ20 మ్యాచ్‌కు ఫలితం రావాలంటే ప్రతి జట్టు కనీసం 5 ఓవర్లు ఆడాలి. అంతకంటే తక్కువగా ఆడితే మ్యాచ్‌ను రద్దు చేసినట్టే. గ్రూప్ దశ మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేదు. అలాంటప్పుడు రెండు జట్లకూ ఒక్కో పాయింట్ ఇస్తారు. ఇప్పటికే గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్ రెండూ రెండు మ్యాచ్‌లు గెలిచి నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో భారత్ ముందు ఉంది. వర్షం వల్ల మ్యాచ్ రద్దయి పాయింట్లు పంచుకుంటే.. రెండు జట్లు సూపర్ ఎయిట్ (Super 8) దశకు దాదాపు చేరినట్టే. ఎందుకంటే మిగతా జట్లు అయిన అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా గరిష్టంగా నాలుగు పాయింట్ల వరకే రావచ్చు.

READ MORE: India vs Pakistan: ‘హ్యాండ్ షేక్’పై సూర్య సంచలన ప్రకటన.. పాక్ కండీషన్.. భారత్ ఒప్పుకుంటుందా?

Exit mobile version