PCB Decision: భారత్–పాక్ మ్యాచ్.. హై వోల్టేజ్ పోరుపై పీసీబీ సంచలన నిర్ణయం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PCB Decision: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై అనిశ్చితి ఇంకా కుదుటపడలేదు. ఫిబ్రవరి 15న జరగాల్సిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌ను బహిష్కరించాలన్న ప్రతిపాదనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. పీసీబీ తన నిర్ణయాన్ని వచ్చే 24 గంటల్లో స్పష్టం చెప్పబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లాహోర్‌లో ఐసీసీ పెద్దలతో జరిగిన దీర్ఘ సమావేశం తర్వాత ఈ అంశం మరింత హాట్ టాపిక్‌గా మారింది. లాహోర్ గద్దాఫీ స్టేడియంలో జరిగిన ఈ సమావేశం ఐదు గంటలకు పైగా సాగింది. ఇందులో పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నక్వీ, ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం పాల్గొన్నారు. వరల్డ్ కప్‌లోనే అతిపెద్ద మ్యాచ్‌గా భావించే భారత్–పాకిస్థాన్ పోరు అనిశ్చితిలో పడకుండా చూడాలన్నదే ఐసీసీ ప్రధాన ఉద్దేశం. టోర్నీ ఇప్పటికే ప్రారంభమై ఉండటంతో సమయం చాలా కీలకంగా మారింది.
READ MORE: Funky : ఫంకీ’లో క్రేజీ సర్ప్రైజ్.. ఆ ఇంట్రెస్టింగ్ కామియో ఎవరిదో తెలుసా?
Also Read
ఈ సమావేశం తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తుది నిర్ణయం తీసుకునే ముందు తమ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించాలనుకుంటోంది. రాజకీయ పరిస్థితులు, అంతర్జాతీయ ప్రభావాలు, క్రికెట్‌కు కలిగే నష్టం అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందుకే రాబోయే 24 గంటలు చాలా కీలకంగా మారాయి. అంతే కాదు.. భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాక్ మూడు షరతులు సైతం పెట్టినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌కు పెరిగిన పరిహారం ఇవ్వాలి. టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినప్పటికీ.. బంగ్లాదేశ్‌కు ఐసీసీ పూర్తి ఫీజులను చెల్లించాలి. భవిష్యత్తులో జరగనున్న ఐసీసీ టోర్నమెంట్‌కు ఆతిథ్య హక్కులు కల్పించాలని పీసీబీ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఈ అంశంపై ఇటు ఐసీసీ నుంచి అటు పీసీబీ నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. ఇప్పటికే వరల్డ్ కప్ సాగుతున్న వేళ, ఈ వివాదం ఎలా ముగుస్తుందో అన్న అంశంపై ప్రపంచ క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వచ్చే 24 గంటల్లో భారత్-పాకిస్థాన్ పోరు జరుగుతుందా లేదా తేలనుంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు