Site icon NTV Telugu

India vs Pakistan: పాకిస్థాన్ బలుపు మాటలు.. భారత్‌తో మ్యాచ్‌కు ఆసిమ్‌ మునీర్‌కి సంబంధం ఏంటి?

Ind Pak

Ind Pak

India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మధ్య కొన్ని రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాక్ అంగీకరించింది. ఫిబ్రవరి 15న జరగాల్సిన ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నక్వీ చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీశాయి. మ్యాచ్ ఆడాలా వద్దా అన్న డెడ్‌లాక్ కొనసాగుతున్న సమయంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నక్వీ బలుపు మాటలు మాట్లాడాడు. భారత్, ఐసీసీ నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని పేర్కొంటూ.. తాను గానీ, తన ప్రభుత్వం గానీ భయపడదని చెప్పాడు. ఈ అంశంలో పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ పేరును ప్రస్తావించాడు. మునీర్ ఎప్పుడూ భయపడరంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు క్రీడా వివాదాన్ని రాజకీయ, సైనిక కోణంలోకి తీసుకెళ్లే ప్రయత్నంగా విశ్లేషకులు భావించారు.

READ MORE: IND vs PAK: ఈసారి గెలుపు మాదే.. పాకిస్థాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!

మొహ్సిన్ నక్వీ కేవలం పీసీబీ ఛైర్మన్ మాత్రమే కాదు.. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా పని చేస్తున్నాడు. అందువల్ల ఆయన చేసిన వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ పేరు ప్రస్తావించడం వెనుక స్పష్టమైన సంకేతం ఉందని అక్కడి మీడియా పేర్కొంది. ఇది కేవలం క్రికెట్ విషయం కాకుండా, దేశ స్థాయి అంశంగా చూపించే ప్రయత్నమని అధికారులు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆసిమ్ మునీర్ ఇటీవలే పాకిస్థాన్ చరిత్రలో అరుదైన ఫీల్డ్ మార్షల్ హోదా పొందాడు. 2025 మే నెలలో “ఆపరేషన్ సిందూర్” తర్వాత జరిగిన సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ అత్యున్నత సైనిక హోదా ఇచ్చారు. కానీ.. క్రికెట్‌కు మునీర్‌కు సంబంధం ఏంటి? మీడియా సమావేశంలో అతడి పేరు ఎందుకు ప్రస్తావించారు? అనే చర్చ జోరుగా సాగుతోంది. నక్వీ చేసిన వ్యాఖ్య పాకిస్థాన్ వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది. రెచ్చగొట్టే ధోరణి ఇంకా మానుకోలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.

READ MORE: AR Rahman : టాలీవుడ్‌లో రెహమాన్ సెకండ్ ఇన్నింగ్స్.. ‘పెద్ది’ మ్యూజిక్ తెచ్చిన క్రేజ్!

Exit mobile version