India vs Pakistan: జస్ప్రీత్ బుమ్రా, షహీన్ ఆఫ్రిదిలలో ఎవరు డేంజరస్?.. బీజేపీ ఎంపీ సమాధానం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir Says Jasprit Bumrah is dangerous Pacer than Shaheen Afridi: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు మెగా సమరం జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పటిలానే భారత్ బ్యాటింగ్, పాకిస్తాన్ బౌలింగ్ మధ్య సమరం జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షహీన్ షా ఆఫ్రిది ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీరిద్దరిలో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
జస్ప్రీత్ బుమ్రా, షహీన్ షా ఆఫ్రిదిలలో అత్యంత ప్రమాదకరం ఎవరనే దానిపై భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు. బుమ్రా డేంజరస్ బౌలర్ అని పేర్కొన్నారు. ‘చెన్నై పిచ్ మీద ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్‌ను జస్ప్రీత్ బుమ్రా ఔట్ చేసిన విధానం అద్భుతం. అఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్‌ను కూడా అదే రీతిలో బోల్తా కొట్టించాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బౌలర్‌గా బుమ్రానే’ అని గౌతీ స్టార్ స్పోర్ట్స్‌లో అన్నారు.
Also Read
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
‘జస్ప్రీత్ బుమ్రా, షహీన్ షా ఆఫ్రిదిలను పోలుస్తూ చాలా మంది విశ్లేషణలు చేస్తున్నారు. ఇద్దరి బౌలింగ్‌లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రతి దశలోనూ బంతితో అద్భుతాలు చేసే బౌలర్ చాలా అరుదుగా ఉంటారు. కొందరు బౌలర్లు కొత్త బంతితో లేదా డెత్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేస్తారు. అయితే బుమ్రా కొత్త బంతి లేదా పాత బంతితో మిడిల్ ఓవర్లలో కూడా అదే ప్రభావాన్ని చూపుతాడు. బంతి కొత్తదా? పాతదా?.. ఏ ఓవర్ అనేది అతడికి అనవసరం. అయితే షహీన్ ఆఫ్రిదిలో ఈ లక్షణాలు లేవు. అందుకే బుమ్రా అత్యంత ప్రమాదకరం’ అని గౌతమ్ గంభీర్ వివరణ ఇచ్చారు.
తాజావార్తలు
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!