India Vs Pakistan: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఆసియా కప్ 2025 భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లో భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు. ముఖ్యంగా స్పిన్నర్లు పాకిస్థాన్ బ్యాటర్లను నిలువరించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణిత 20 ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో 63 డాట్ బాల్స్ వేశారు భారత బౌలర్లు.
Bigg Boss-9 : ఆ కంటెస్టెంట్ కు పాజిటివ్ వైబ్స్.. విన్నర్ అయ్యే ఛాన్స్..?
పాకిస్తాన్ ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే తడబడింది. తొలి ఓవర్ మొదటి బంతికే సైమ్ అయూబ్ డకౌట్ కాగా, ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. ఫఖర్ జమాన్ (17), సల్మాన్ అఘా (12), హసన్ నవాజ్ (12) వంటి కీలక బ్యాట్స్‌మెన్స్ నిరాశపరిచారు. ఇన్నింగ్స్ చివరిలో షాహీన్ షా అఫ్రిది 16 బంతుల్లో 33 పరుగులు చేసి అజేయంగా ఉండి ధాటిగా ఆడటంతో పాకిస్తాన్ స్కోరు 127 పరుగులకు చేరింది.
OG : సుజీత్ కు అగ్నిపరీక్ష.. పవన్ మీదే ఆశలు..
ఇక భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించి 18 పరుగులకే 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా 28 పరుగులిచ్చి 2 వికెట్లు, అక్షర్ పటేల్ 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీసి పాకిస్తాన్‌ను కట్టడి చేశారు. ఇక భారత్ విజయం కోసం 128 పరుగులు చేయాల్సి ఉంది. చూడాలి మరి ఈ స్కోర్ ను ఎంత త్వరగా భారత్ చేధించనుందో..