Site icon NTV Telugu

India vs Oman: నేడు ఒమన్‌తో భారత్‌ ఢీ.. రెండు మార్పులు తప్పవా? తుది జట్లు ఇవే

Team India

Team India

ఆసియా కప్‌ 2025లో తన చివరి గ్రూప్‌ మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. పసికూన ఒమన్‌ను సూర్య సేన ఢీకొట్టనుంది. ఆదివారం పాకిస్థాన్‌తో సూపర్ 4 పోరు నేపథ్యంలో భారత్ ఈ మ్యాచ్‌ను ప్రాక్టీస్‌లా ఉపయోగించుకోనుంది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న భారత్.. యూఏఈ, పాకిస్థాన్‌లపై ఘన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. పటిష్ట భారత్ పసికూన ఒమన్‌పై గెలవడం ఖాయం. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది.

ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. స్టార్ బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతిని ఇచ్చే అవకాశముంది. బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్‌ సింగ్ ఆడనున్నాడు. అబుధాబి పిచ్‌ స్పిన్నర్లకు పెద్దగా సహరించకపోవచ్చు. ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్, వరుణ్‌ చక్రవర్తిలలో ఒకరికే తుది జట్టులో ఛాన్స్ దక్కొచ్చు. అర్ష్‌దీప్‌తో పాటు హర్షిత్‌ రాణా ప్లేయింగ్ 11లోకి వచ్చే అవకాశముంది. బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు లేవు. బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ కోసం ఈ మ్యాచ్‌లో భారత్‌ ముందుగా బ్యాటింగ్‌ చేయడానికే మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి.

Also Read: CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో బిజీగా సీఎం రేవంత్.. రాష్ట్రంలో పెట్టుబడులే టార్గెట్!

తుది జట్లు (అంచనా):
భారత్‌: అభిషేక్‌ శర్మ, శుభ్‌మ‌న్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్‌ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్/వరుణ్‌ చక్రవర్తి.
ఒమన్‌: జతిందర్, కలీమ్, హమద్, వసీమ్, ఆర్యన్, వినాయక్, జితేన్, ఫైసల్, షకీల్, హొస్సేన్‌ షా, సమయ్‌.

Exit mobile version