India vs New Zealand 1st test: బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో వర్షం అంతరాయం కలిగించిన భారత్‌తో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలిరోజు వర్షం కారణంగా రద్దయిన తర్వాత ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ అదిరిపోయే ప్రదర్శన కనబరిచింది. మ్యాచ్‌లో ఐదో, చివరి రోజైన ఆదివారం కివీస్ జట్టు విజయానికి 107 పరుగులు చేయాల్సి ఉండగా రెండు వికెట్లు కోల్పోయి 8 వికెట్లతో విజయం సాధించింది. మ్యాచ్ లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 46 పరుగులకే ఆలౌట్ చేసింది. దీని తర్వాత బ్యాట్టింగ్ కు వచ్చిన రచిన్ రవీంద్ర 134 పరుగులు, డెవాన్ కాన్వే 91 పరుగుల సాయంతో న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగుల భారీ స్కోర్ చేసింది.
Bomb Threat : ఎక్కువైన బెదిరింపులు.. అసలు చేసేది ఎవరు.. విమానాల్లో ప్రయాణం ఎంతవరకు సురక్షితం ?
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో సర్ఫరాజ్ ఖాన్ (150) తొలి టెస్టు సెంచరీ, రిషబ్ పంత్ 99 పరుగుల సాయంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు పరిమతమైంది. దింతో న్యూజిలాండ్‌కు 107 పరుగుల సులభమైన లక్ష్యాన్ని అందించింది. బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్ నాలుగో రోజు న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఆట ముగిసింది. ఐదో రోజు కూడా ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. రోజు తొలి బంతికే కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్‌ను ఎల్‌బీడబ్ల్యూ ద్వారా జస్ప్రీత్ బుమ్రా పెవిలియన్ కు చేర్చాడు. అయితే, కాన్వే – విల్ యంగ్ తమ టీమ్‌ను కాపాడే ప్రయత్నం చేసారు. భారత బౌలర్లు వీరిద్దరినీ ఇబ్బంది పెట్టినా వికెట్ పడకుండా కొద్దీ సేపు పోరాడారు. వీరిద్దరి మధ్య కేవలం 35 పరుగుల భాగస్వామ్యం కివీ జట్టును మళ్లీ మ్యాచ్‌లోకి తీసుకొచ్చింది.
Duvvada Srinivas and Divvala Madhuri: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి నోటీసులు
అయితే ఆ తర్వాత కాన్వేను ఔట్ చేయడం ద్వారా బుమ్రా మళ్లీ భారత్ ఆశలను పెంచాడు. ఆ తర్వాత యంగ్ మళ్లీ రవీంద్ర మద్దతును తీసుకోని మరో వికెట్ కోల్పోకుండా భారత్ కు ఓటమిని కట్టబెట్టారు. రవీంద్ర 39 పరుగులతో నాటౌట్‌గా, విల్ యంగ్ 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. 36 ఏళ్ల తర్వాత భారత్‌లో న్యూజిలాండ్‌కి ఇదే తొలి టెస్టు విజయం. అంతకుముందు, కివీ జట్టు 1988-89లో ఆడిన సిరీస్‌లో స్వదేశంలో జరిగిన టెస్టులో భారత్‌ను ఓడించింది. భారత్, న్యూజిలాండ్ మధ్య మరో రెండు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో భారత్ తప్పక గెలవాలి. ఎందుకంటే, అప్పుడే సిరీస్ కైవసం చేసుకోవచ్చు. రెండో టెస్టు అక్టోబర్ 24 నుంచి పుణెలో, మూడో టెస్టు నవంబర్ 1 నుంచి వాంఖడే స్టేడియంలో ప్రారంభం కానుంది.