India vs China: నేడు భారత్, చైనా మహిళల ఆసియా కప్ హాకీ 2025 ఫైనల్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చైనాలోని హాంగ్జౌలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు వచ్చే ఏడాది ఆగస్టు 14 నుంచి 30 వరకు బెల్జియం, నెదర్లాండ్స్‌లో జరగనున్న మహిళల హాకీ ప్రపంచ కప్‌కు నేరుగా ప్రవేశం పొందుతుంది. కాగా.. ఈ మ్యాచ్‌లో భారత్‌కు షాక్ తగిలింది. భారత జట్టు అనుభవజ్ఞులైన గోల్ కీపర్ సవితా పూనియా, డ్రాగ్ ఫ్లికర్ దీపికా జూనియర్ లేకుండానే బరిలోకి దిగనుంది. ఈ ఇద్దరు క్రీడాకారిణులు గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నారు. వీళ్లు లేని లోటు మ్యాచ్‌లో కనిపిస్తుందని చెబుతున్నారు.
READ MORE: Asaduddin Owaisi: భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌పై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..
కాగా.. శనివారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్‌తో పోరును మన మహిళలు 1-1తో డ్రా చేశారు. అయితే సూపర్-4 చివరి మ్యాచ్‌లో ఆతిథ్య చైనా 1-0తో కొరియాను ఓడించడంతో.. భారత జట్టుకు కలిసి వచ్చింది. దీంతో భారత మహిళల జట్టు ఆసియా కప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. నేడు జరిగే టైటిల్ ఫైట్‌లో చైనాతో భారత మహిళలు అమీతుమీ తేల్చుకోనున్నారు.
READ MORE: Social Media Reels Addiction: రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? అయితే ఈ సమస్యలు మీతోనే!
భారత తుది జట్టు..
గోల్‌కీపర్లు: బన్సారీ సోలంకి, బిచ్చు దేవి ఖరీబామ్
డిఫెండర్లు: మనీషా చౌహాన్, ఉదిత, జ్యోతి, సుమన్ దేవి, నిక్కీ ప్రధాన్, ఇషికా చౌదరి
మిడ్‌ఫీల్డర్లు: నేహా, వైష్ణవి ఫాల్కే, సలీమా టేట్, సునెల్ నవేట్ దేవి (కెప్టెన్), షర్మిలాతోప్, షర్మిలామిపో కౌర్, రితుజా పిసల్, బ్యూటీ డంగ్ డంగ్, ముంతాజ్ ఖాన్, సాక్షి, సంగీత కుమారి.