India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ భవిష్యత్ పాత్రపై కీలక అంచనాలు వెలువడ్డాయి. 2060 నాటికి కొనుగోలు శక్తి సమానత్వం (PPP) ప్రాతిపదికన ప్రపంచ జీడీపీలో భారత వాటా చైనాను అధిగమించనున్నట్లు ప్రముఖ పరిశోధనా సంస్థ వరల్డ్ ఇనిక్వాలిటీ ల్యాబ్ (WIL) నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం చైనా ప్రపంచ జీడీపీలో సుమారు 20 శాతం వాటా కలిగి ఉన్నప్పటికీ, జనాభా తగ్గుదల ప్రభావంతో 21వ శతాబ్దం రెండోర్థంలో ఆ దేశ ఆర్థిక ప్రాధాన్యం క్రమంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు చెందిన పరిశోధకులు రూపొందించిన ‘గ్లోబల్ జస్టిస్ రిపోర్ట్: ఏ ప్లాన్ ఫర్ ఈక్వాలిటీ అండ్ ప్రాస్పెరిటీ విత్ ప్లానెటరీ బౌండరీస్’ నివేదికలో ఈ అంశాలను వెల్లడించారు.
చైనా వాటా తగ్గుదల
నివేదిక ప్రకారం.. 1945లో ప్రపంచ జనాభాలో చైనా వాటా 23 శాతం ఉండగా.. 2025 నాటికి అది 17 శాతానికి పడిపోయింది. 2100 నాటికి ఇది 8 శాతం కంటే తక్కువకు చేరే అవకాశం ఉంది.జనాభా తగ్గుదల కారణంగా చైనా ప్రపంచ జీడీపీలో వాటా మొదట స్థిరపడిన తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుందని.. 2060 ప్రాంతంలో భారత్ దానిని అధిగమించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
Also Read
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
- PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్‌లో కీలక వ్యాఖ్యలు
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్‌కు కీలక సమాచారం!
భారత్‌కు భారీ అవకాశం
భారత్ జనాభా, వినియోగ మార్కెట్, ఆర్థిక విస్తరణ, సేవల రంగం వృద్ధి వంటి అంశాలు దీర్ఘకాలంలో దేశానికి అనుకూలంగా మారనున్నాయి. అయితే చైనాతో పోలిస్తే భారత్‌లో అసమానతలు ఎక్కువగా ఉన్నాయని, ఉత్పాదకత వృద్ధి మాత్రం తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. చైనాలో మానవ వనరుల అభివృద్ధి, విద్య, నైపుణ్యాలపై భారీ పెట్టుబడులు పెట్టడం వల్ల ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందిందని విశ్లేషించింది.
21వ శతాబ్దంలో ప్రపంచం ఒకే దేశ ఆధిపత్యంలో కాకుండా బహుళ ధ్రువ (Multipolar) ఆర్థిక వ్యవస్థగా మారుతుందని నివేదిక అంచనా వేసింది. 1950లలో అమెరికా ప్రపంచ జీడీపీలో 35-40 శాతం వాటాతో ఆధిపత్యం చెలాయించగా.. 1900-1910 మధ్య యూరప్ వాటా 40-45 శాతం వరకు ఉండేది. అయితే చైనా ఎప్పటికీ ఆ స్థాయి ఆధిపత్యాన్ని సాధించే అవకాశం చాలా తక్కువగా ఉందని నివేదిక స్పష్టం చేసింది.
2026 జీడీపీ అంచనాలు
ప్రపంచ ఆర్థిక దృక్పథం (WEO) తాజా అంచనాల ప్రకారం:
అమెరికా జీడీపీ: 32.38 ట్రిలియన్ డాలర్లు
చైనా జీడీపీ: 20.85 ట్రిలియన్ డాలర్లు
భారత్ జీడీపీ: 4.15 ట్రిలియన్ డాలర్లు
యూకే జీడీపీ: 4.27 ట్రిలియన్ డాలర్లు
జపాన్ జీడీపీ: 4.38 ట్రిలియన్ డాలర్లు
2025లో 3.92 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత జీడీపీ, 2026లో 4.15 ట్రిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేస్తున్నారు.
PPP అంటే ఏమిటి?
కొనుగోలు శక్తి సమానత్వం (Purchasing Power Parity – PPP) అనేది ఒక దేశ కరెన్సీతో కొనుగోలు చేయగల వస్తువులు, సేవల పరిమాణాన్ని మరో దేశ కరెన్సీతో పోల్చే ప్రమాణం. సాధారణ జీడీపీ కంటే దేశ ప్రజల వాస్తవ కొనుగోలు శక్తిని అంచనా వేయడానికి PPPను ఉపయోగిస్తారు. ఈ ప్రకారంగా భారత్ 2060 నాటికి ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగి చైనాను అధిగమించే అవకాశం ఉందన్న ఈ అంచనా దేశ ఆర్థిక భవిష్యత్‌పై ఆశావహ సంకేతాలను ఇస్తోంది.
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసి TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!