Site icon NTV Telugu

India-Pakistan: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ఎస్‌సీ‌ఓ సమ్మిట్‌కు ఆహ్వానించనున్న భారత్

Shahbaz Sharif

Shahbaz Sharif

India-Pakistan: గోవాలో జరగబోయే షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) సమావేశానికి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను భారత్ ఆహ్వానించనుంది. అంతకుముందు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు కూడా భారత్ ఆహ్వానం పలికింది. వీరిద్దరిలో ఎవరు హాజరైనా.. 2011 తర్వాత భారత్ ను సందర్శించిన పాక్ ప్రతినిధులుగా చరిత్రకెక్కుతారు. వీరితో పాటు చైనా విదేశాంగ శాఖ మంత్రి క్విన్ గ్యాంగ్ కు కూడా భారత్ ఆహ్వానం పలికింది. అయితే వీరిద్దరు సమావేశానికి హాజరావుతారా..? లేదా..? అనేది ధృవీకరించలేదు. పాక్ తరుపున 2011లో అప్పటి విదేశాంగ మంత్రి హీనా రాబ్బానీ ఖర్ భారత్ తో పర్యటించారు.

Read Also: Revanth Reddy: గవర్నర్, సీఎంల మధ్య విభేదాలు ఉంటే వేరే వేదిక చూసుకోవాలి.. ఇది సరైన పద్దతి కాదు..

ఈ ఏడాది ఎస్‌సీ‌ఓ అధ్యక్ష బాధ్యతలను భారత్ తీసుకుంది. భారత్ తో పాటు చైనా, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్, కిర్గిజ్ స్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఎస్‌సిఓ విదేశాంగ మంత్రుల సమావేశం మే మొదటివారంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ సభ్యదేశాల విదేశాంగ మంత్రులకు ఆహ్వానాలను అందిస్తోంది.

2019 ఫిబ్రవరిలో పాకిస్తాన్ లోని బాలకోట్ జైషేమహ్మద్ స్థావరాలపై భారత్ యుద్ధవిమానాలతో దాడి చేసింది. పుల్వామా అటాక్ జరిగిన తర్వాత ఈ దాడి జరిగింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి. దీని తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి, ఆర్టికల్ 370,35ఏని తొలగించడంతో రెండు దేశాల మధ్య అఘాతం మరింత పెరిగింది. అయితే వచ్చే నెలల్లో జరగబోయే ఎస్‌సిఓ సమావేశాలకు పాకిస్తాన్ హాజరవుతుందో లేదో చూడాలి.

Exit mobile version