NTV Telugu Site icon

U-19 World Cup 2025: అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేత భారత్..

India

India

అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది. వరుసగా రెండోసారి అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది భారత్. కౌలాలంపూర్ వేదికగా జ‌రిగిన ఫైన‌ల్లో 9 వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. 11.2 ఓవర్లలోనే 83 పరుగుల టార్గెట్‌ను భారత్ బ్యాటర్లు రీచ్ అయ్యారు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ భారత జట్టు దుమ్మురేపింది. అండర్ 19 టీ20 ప్రపంచకప్ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. 82 పరుగులకే కుప్పకూలింది. అండర్-19 ప్రపంచకప్ ఛాంపియన్ కావాలన్న దక్షిణాఫ్రికా కలను భారత్ 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

Read Also: Sri Tej: శ్రీ తేజ్ ని పరామర్శించిన బన్నీ వాసు.. అవసరమైతే చికిత్స కోసం విదేశాలకు?

సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో వాన్‌ వూరస్ట్ (23) అత్యధిక పరుగులు చేసింది. జెమా బోథా(16), ఫే కోవిలింగ్‌(15) పరుగులతో పర్వాలేదన్పించారు. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. మరోవైపు.. బ్యాటింగ్, బౌలింగ్‌లో తెలుగమ్మాయి గొంగడి త్రిష అదరగొట్టింది. 32 బంతుల్లో 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది త్రిష. బౌలింగ్‌లోనూ మూడు వికెట్లతో రాణించింది త్రిష. భారత్ బౌలర్లలో వైష్ణవి శర్మ, అయూష్‌ శుక్లా, పరునికా సిసోడియా తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం.. 83 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 11.2 ఓవర్లలో సునాయసంగా చేధించింది. త్రిషతో పాటు సానికా చాల్కే(26*) కూడా రాణించింది. ఈ మొత్తం టోర్నీలో టీమిండియా అజేయంగా నిలిచింది. ఫైనల్‌తో సహా ఏడు జట్లపై వరుసగా విజయం సాధించింది.

Read Also: UP Crime: మరదలిపై గ్యాంగ్ రేప్, హత్య కోసం రూ.40,000 అప్పు.. సంచలనంగా యూపీ కేసు..