Site icon NTV Telugu

IND vs BAN: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడికి చోటు

Team India

Team India

బంగ్లాదేశ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును భారత క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. టెస్టు సిరీస్ తర్వాత భారత్.. గ్వాలియర్, న్యూఢిల్లీ, హైదరాబాద్‌లలో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన జట్టులో భాగమైన భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి వచ్చాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో అతనికి విశ్రాంతి ఇచ్చారు. మళ్లీ ఈసారి ఇషాన్ కిషన్‌కు నిరాశే దక్కింది. మరోవైపు.. ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లకు విశ్రాంతి ఇచ్చారు.

బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు సంజూ శాంసన్, జితేష్ శర్మ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఆడనున్నారు. ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దాదాపు మూడేళ్ల తర్వాత కూడా జట్టులో చోటు సంపాదించుకోగలిగాడు. కుల్దీప్ యాదవ్‌ను ఈ సిరీస్‌కు జట్టులో ఎంపిక చేయలేదు.

ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన మయాంక్ యాదవ్ తన వేగంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. మయాంక్ నాలుగు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు తీశాడు. అయితే గాయం కారణంగా అతను దూరమయ్యాడు. ఐపీఎల్‌ అరంగేట్రంలోనే మూడు వికెట్లు తీశాడు. అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2024లో మయాంక్ గంటకు 155 కిమీ కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేశాడు. మరోవైపు.. జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో పాల్గొన్న అభిషేక్ శర్మకు అవకాశం లభించింది. అలాగే.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది.

అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో భారత్‌ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను అక్టోబర్‌ 6 నుంచి గ్వాలియర్‌లో ఆడనుంది. రెండో మ్యాచ్ అక్టోబర్ 9న న్యూఢిల్లీలో, మూడో మ్యాచ్ అక్టోబర్ 12న హైదరాబాద్‌లో జరగనుంది.

Samsung Galaxy Tab S10: AI ఫీచర్లతో శాంసంగ్ కొత్త టాబ్లెట్‌లు విడుదల.. ఫీచర్లు ఇవే..!

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు…
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, ర్యాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.

Exit mobile version