Site icon NTV Telugu

IND vs ZIM: తక్కువ స్కోరుకే కట్టడి చేసిన భారత్.. టార్గెట్ ఎంతంటే..?

Ind

Ind

జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో భారత్ తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వే 115 పరుగులు మాత్రమే చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఈ పరుగులు సాధించింది. జింబాబ్వే బ్యాటర్లలో క్లైవ్ మదాండే (29*) అత్యధిక పరుగులు చేశాడు. ఆ తర్వాత.. వెస్లీ మాధేవేరే (21), బ్రియాన్ బెన్నెట్ (22), డియోన్ మైయర్స్ (23), సికిందర్ రజా (17) పరుగులు చేశారు. జింబాబ్వే బ్యాటర్లలో ముగ్గురు డకౌట్లు అయ్యారు. కాగా.. టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో తక్కువ పరుగులకు కట్టడి చేసింది.

Alcohol: ఆల్కహాల్‌, ఎనర్జీ డ్రింక్‌ కలిపి తాగితే అంతే సంగతి.. అధ్యయనంలో కీలక విషయాలు..

భారత్ బౌలర్లలో అత్యధికంగా స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత.. వాషిగ్టంన్ సుందర్ 2 వికెట్లు తీశాడు. అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్ కు తలో వికెట్ దక్కింది. టీమిండియా టార్గెట్ 116 పరుగులు చేయాల్సి ఉంది. ఓపెనర్ గా అభిషేక్ శర్మ, శుభ్మాన్ గిల్ బరిలోకి దిగనున్నారు.

Renukaswamy Murder Case: హత్యకు ముందు పీకల దాకా ఆహారం.. రేణుకా స్వామి పోస్టుమార్టం రిపోర్టులో సంచలన అంశాలు

Exit mobile version