T20 World Cup 2026: టీమిండియాకు 2012 ప్రపంచ కప్ గండం.. అప్పట్లాగే నెట్ రన్ రేట్ దెబ్బకొడుతుందా?

T20 World Cup 2026

T20 World Cup 2026

T20 World Cup 2026: 2026 టీ20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం ముటగట్టుకున్న భారత్, ప్రస్తుతం ఈ మెగా టోర్నీలో చాలా ఇబ్బందులను ఎదుర్కుంటుంది. ఈ ఓటమితో భారత్‌కు సెమీఫైనల్ చేరడం ఒక పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం టీమిండియా నెట్ రన్ రేట్ -3.800 గా ఉంది. ఇది అభిమానులను తీవ్రంగా ఆందోళన కలిగిస్తుంది.

READ ALSO: WhatsApp Supreme Court Case: సుప్రీంకోర్టులో యూ-టర్న్‌ తీసుకున్న వాట్సాప్..

భారత్ ముందున్న మ్యాచులు ఇవే..
సెమీస్ చేరాలంటే టీమిండియా తన నెక్ట్స్ రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. భారత్ ఫిబ్రవరి 26న జింబాబ్వేతో, మార్చి 1న వెస్టిండీస్‌తో తలపడబోతుంది. టీమిండియా సెమీస్ చేరాలంటే ఉన్న ఛాన్స్‌లు ఏమిటంటే.. దక్షిణాఫ్రికా తన మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ (జింబాబ్వే, విండీస్) గెలవాలి. అప్పుడు భారత్ తన రెండు మ్యాచ్‌లు గెలిస్తే, రన్ రేట్ తో సంబంధం లేకుండా నేరుగా సెమీస్ కి వెళ్తుంది. ఒకవేళ వెస్టిండీస్ జట్టు.. జింబాబ్వే, దక్షిణాఫ్రికాపై గెలిస్తే.. అప్పుడు భారత్, విండీస్, సౌతాఫ్రికా మూడూ తలో రెండు విజయాలతో సమానంగా ఉంటాయి. అప్పుడు ఎవరి రన్ రేట్ బాగుంటే వారే సెమీస్ కి వెళ్తారు. ప్రస్తుతం భారత్ రన్ రేట్ మైనస్‌లో ఉండటం పెద్ద సమస్యగా మారింది.

2012 నాటి సీన్ రిపీట్ అవుతుందా..
సరిగ్గా 14 ఏళ్ల క్రితం (2012లో) టీమిండియాకు ఇలాగే జరిగింది. అప్పుడు సూపర్-8లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ భారీ తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత పాకిస్థాన్, దక్షిణాఫ్రికాపై గెలిచినప్పటికీ.. ఆస్ట్రేలియా కంటే తక్కువ రన్ రేట్ ఉండటంతో భారత్ సెమీస్ చేరకుండానే ఇంటికి వచ్చేసింది. ఆ టోర్నీలో భారత్ 3 మ్యాచ్‌ల్లో 2 గెలిచినా రన్ రేట్ వల్ల సెమీస్‌కు చేరకుండా తిరిగి రావాల్సి వచ్చింది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా మెరుగైన రన్ రేట్‌తో సెమీస్‌కి వెళ్లాయి. ఆ మెగా టోర్నీలో చివరికి వెస్టిండీస్ కప్పు కొట్టింది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ గెలిస్తే సరిపోదు, రన్ రేట్‌ను కూడా భారీగా మెరుగుపరుచుకోవాలి. ముఖ్యంగా వెస్టిండీస్, జింబాబ్వేపై భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. లేదంటే 2012 నాటి కథే మళ్లీ పునరావృతం అవుతుందని అంటున్నారు.

READ ALSO: Bangladesh President: “నన్ను చంపినా సరే.. రాజీనామా చేయనని చెప్పాను!” యూనస్‌పై బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు..