NTV Telugu Site icon

IND vs AUS: హమ్మయ్య మరోసారి వర్షం.. డ్రా దిశగా మూడో టెస్టు

Gabba Test

Gabba Test

IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో మ్యాచ్ బ్రిస్బేన్‌ లోని గబ్బా మైదానంలో జరుగుతోంది. ఈరోజు మ్యాచ్‌లో నాలుగో రోజు కొనసాగుతుంది. మ్యాచ్ లో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే, మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టు ఆరంభం మరోసారి నిరాశపరిచింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలి ఓవర్‌లోనే పెవిలియన్‌కు చేరుకున్నాడు. మ్యాచ్ నాలుగో రోజు బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ చక్కటి బ్యాటింగ్ చేసాడు. అయితే, సెంచరీ దిశగా కొనసాగుతుండగా 84 పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు.

Also Read: Trump – Trudeau: కెనడాకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్.. ట్రూడో అలర్ట్!

ఇకపోతే మూడో టెస్ట్ మొదలైనప్పటి నుంచి వర్షం ఆడకు అడ్డంకి కలిగిస్తూనే ఉంది. మొదటి మొదటిరోజు వర్షం కారణంగా కేవలం 15 ఓవర్ల మేరకు మాత్రమే ఆట జరిగింది. అయితే రెండో రోజు మాత్రం వర్షం తీవ్రత తగ్గడంతో ఆట బాగానే కొనసాగింది. మూడో రోజు కూడా పలుమార్లు వర్షం ఆటంకం కలిగించడంతో పూర్తి ఆట కొనసాగలేదు. నాలుగో రోజు కూడా వర్షం కారణంగా ఆట పలుమార్లు ఆగుతోంది. ప్రస్తుతం వర్షం కారణంగా ఆట ఆగిపోయింది. వర్షం పడుతున్న సమయానికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్రీజులో రవీంద్ర జడేజా 88 బంతులతో 52 పరుగులు, హైదరాబాద్ కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి 26 మంది 9 పరుగులతో ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే.. మూడో టెస్టు మ్యాచ్ డ్రా అయ్యే సూచనలు ఎక్కువగా కనపుడుతున్నాయి.

Also Read: TTD Update: శ్రీవారి భక్తుల అలర్ట్.. రేపటి నుంచి ఆర్జిత సేవా టికెట్లు!

Show comments