Site icon NTV Telugu

Asia Cup 2025: ఏడుగురు లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాటర్‌లు.. బీసీసీఐ సెలెక్టర్ల ఎత్తుగడ అదేనా?

Asia Cup 2025 India Squad Review

Asia Cup 2025 India Squad Review

Asia Cup 2025 India Squad Analysis: ఆసియా కప్‌ 2025లో పోటీపడే భారత జట్టును భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా కొనసాగగా.. శుభ్‌మన్‌ గిల్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గిల్‌ ఎంట్రీతో ఏడాది కాలంగా సూర్యకు డిప్యూటీగా ఉన్న అక్షర్‌ పటేల్‌కు నిరాశ తప్పలేదు. బ్యాటింగ్‌ను మాత్రమే కాకుండా.. బౌలింగ్‌ను కూడా బలంగా ఉండేలా ఆటగాళ్లను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. అంతేకాదు ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాటర్‌లు ఉన్నారు. ఇది బీసీసీఐ సెలెక్టర్ల ఎత్తుగడ అని తెలుస్తోంది.

బీసీసీఐ సెలెక్టర్లు ఏడుగురు లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాటర్‌లతో పాటు ముగ్గురు ఆల్‌రౌండర్‌లకు జట్టులో చోటిచ్చారు. యూఈఏ పిచ్‌లు స్లోగా ఉంటాయి కాబట్టి ముగ్గురు స్పిన్నర్‌లను (వరుణ్‌ చక్రవర్తి, కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్ పటేల్) సైతం ఎంపిక చేశారు. ఇది సెలెక్టర్ల ఎత్తుగడ అని ఇట్టే అర్ధమవుతోంది. హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ జట్టులోని స్టార్ ఆల్‌రౌండర్‌లు. యూఏఈలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారు. యూఈఏ పిచ్‌లపై పరుగులు చేయడం అంత సులభం కాదు. బ్యాట్స్ మెన్ స్పిన్నర్లకు ఈజీగా దొరికిపోతారు. ఈ పరిస్థితిలో స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగే లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాటర్‌లు ఏ జట్టుకైనా ఉపయోగపడుతారు. అందుకే ఎక్కువగా లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాటర్‌లను సెలెక్టర్లు ఎంపిక చేసి ఉండొచ్చు.

జట్టులో లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాటర్‌ ఉంటే కచ్చితంగా అదనపు ప్రయోజనం ఉంటుంది. ప్రత్యర్థి బౌలర్లు, ఫీల్డర్లు అందుకు అనుగుణంగా కుదురుకోవాల్సి ఉంటుంది. తరచూ స్ట్రైక్‌ రొటేట్‌ చేయడం వల్ల బౌలర్లను ఇరుకున పెట్టొచ్చు. దాంతో సునాయాసంగా పరుగులు చేయొచ్చు. ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, శివం దూబే, అర్ష్ దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ లెఫ్ట్‌ హ్యాండర్‌లు. సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి, జితేష్ శర్మ, హర్షిత్‌ రాణాలు రైట్ హ్యాండర్‌లు.

Also Read: Realme P4 5G Launch: నేడే ‘రియల్‌మీ పీ4 5జీ’ లాంచ్.. ఆ ఫీచర్ ఉన్న మొదటి స్మార్ట్‌ఫోన్‌ ఇదే! ప్రైజ్, ఫీచర్స్ ఇవే

భారత జట్టు:
సూర్యకుమార్, గిల్, అభిషేక్, హార్దిక్, అక్షర్, బుమ్రా, జితేశ్‌ శర్మ, శివమ్‌ దూబె, అర్ష్‌దీప్, సంజు శాంసన్, హర్షిత్‌ రాణా, తిలక్‌ వర్మ, రింకు సింగ్, వరుణ్‌ చక్రవర్తి, కుల్‌దీప్‌ యాదవ్‌.
స్టాండ్‌బైలు: ప్రసిద్ధ్‌ కృష్ణ, వాషింగ్టన్‌ సుందర్, రియాన్‌ పరాగ్, ధ్రువ్‌ జురెల్, యశస్వి జైస్వాల్.

Exit mobile version