Site icon NTV Telugu

Nikki Haley: భారత్‌ చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తోంది.. నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Nikki Haley

Nikki Haley

Nikki Haley: ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో భారత్ చాలా తెలివిగా వ్యవహరిస్తోందని, రష్యాతో సన్నిహితంగా ఉంటోందని రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ అన్నారు. భారత్‌పై బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు భారత్‌ భాగస్వామిగా ఉండాలనుకుంటుందని, కానీ ఇప్పుడు అగ్రరాజ్యం పెద్దన్న పాత్ర పోషించడంపై మాత్రం వారికి విశ్వాసం లేదన్నారు. ఫాక్స్ బిజినెస్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్కీ హేలీ మాట్లాడుతూ, ప్రస్తుతానికి, భారతదేశం అమెరికాను బలహీనంగా చూస్తుందని అన్నారు.

Read Also: Antibiotics: యాంటీబయాటిక్స్‌ని అనవసరంగా వాడకుండా ప్రభుత్వం ఏం చేస్తోంది?

నిక్కీ హేలీ మాట్లాడుతూ.. “నేను అమెరికా తరఫున భారత వ్యవహారాలను చూశాను. నేను మోడీతో మాట్లాడాను. భారతదేశం మాతో భాగస్వామిగా ఉండాలనుకుంటోంది. కానీ ప్రస్తుతం వారికి మన నేతృత్వంపై నమ్మకం లేదు. అమెరికా చాలా బలహీనంగా ఉన్నామనుకుంటున్నారు. భారత్‌ చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తోంది. అందుకే సైనిక ఆయుధాలను అందించే రష్యాకు సన్నిహితంగా ఉంటూ వస్తోంది.”అని నిక్కి హేలీ అన్నారు. అగ్రరాజ్యం అమెరికా ప్రస్తుతం మధ్యప్రాచ్య దేశాలపైనే అధికంగా దృష్టి సారిస్తోందని నిక్కీ హేలీ తెలిపారు. అలా కాకుండా ఇతర భాగస్వాములతోనూ సత్సంబంధాలను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. అప్పుడే అమెరికాతో మిత్రదేశాలైన భారత్‌, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌, జపాన్‌, దక్షిణకొరియా, న్యూజిలాండ్‌ కలిసి వస్తాయని పేర్కొన్నారు. చైనా ఆర్థికంగా బాగా లేదని, అమెరికాతో యుద్ధానికి సిద్ధమవుతోందని హేలీ అన్నారు.

Exit mobile version