NTV Telugu Site icon

Bangladesh: బంగ్లాదేశ్‌లో మోడీ దుర్గామాతకు బహూకరించిన కిరీటం చోరీ.. భారత్‌ సీరియస్

Bangladesh

Bangladesh

బంగ్లాదేశ్‌లోని జెషోరేశ్వరి ఆలయంలో దుర్గామాత కిరీటం చోరీకి గురైంది. 2021లో బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ కిరీటాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. చోరీ ఘటనపై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘటనను భారత్ తీవ్ర ఆందోళనతో చూస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

READ MORE: Pakistan: EAM జైశంకర్ పాకిస్తాన్ పర్యటన.. రావాల్సిండిలో 144 సెక్షన్ విధించిన పాక్ సర్కార్..

‘దెబ్బతిన్న దేవాలయాల నమూనా’
“ఢాకాలోని తాంతిబజార్‌లోని పూజా మందిరంపై దాడి, సత్ఖిరాలోని ఐకానిక్ జెషోరేశ్వరి కాళీ ఆలయంలో చోరీని తీవ్ర ఆందోళనతో గమనించాం. ఇవి ఖండించదగిన ఘటనలు. వారు దేవాలయాలు, దేవతలను అపవిత్రం చేయడం, హాని కలిగించే క్రమ పద్ధతిని అనుసరిస్తున్నారు. వీటిని మేము గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. హిందువులు, మైనారిటీల వారి ప్రార్థనా స్థలాలు, ప్రత్యేకించి ఈ పండుగ సీజన్‌లో భద్రత కల్పించాలని మేము బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

READ MORE: RAPO22 : మహేష్‌బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు
ఢాకాలోని భారత హైకమిషన్ మాట్లాడుతూ.. “ఈ ఘటనపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. దొంగతనంపై దర్యాప్తు చేయాలి. కిరీటాన్ని స్వాధీనం చేసుకుని అమ్మావారికి అలంకరించాలి. దోషులపై చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.” అని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఆలయంలోని కిరీటం చోరీకి సంబంధించిన సీసీటీవీ వీడియోలో జీన్స్, టీ షర్ట్ ధరించిన ఓ బాలుడు ఆలయంలోకి ప్రవేశించడం కనిపించింది. కిరీటాన్ని తీసుకున్న తర్వాత, అతను దానిని తన టీ-షర్టులో దాచిపెట్టి, ఆ తర్వాత మామూలుగా గుడి నుంచి బయలుదేరాడు.

Show comments