NTV Telugu Site icon

Mpox Clade 1: భారత్‌లో కొత్త వేరియంట్ కలకలం.. Mpox క్లాడ్ 1B కేసు నమోదు

Monkeypox

Monkeypox

భారత్‌లో కొత్త వేరియంట్ కలకలం రేపుతుంది. మంకీపాక్స్ క్లాడ్ 1బి మొదటి కేసు నమోదైంది. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు సోమవారం ధృవీకరించాయి. గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన మంకీపాక్స్ జాతి అని అధికారులు తెలిపారు. ఈ Mpox క్లాడ్ 1B వేరియంట్ కేసు కేరళకు చెందిన ఒక వ్యక్తిలో కనుగొన్నారు. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుండి తిరిగి వచ్చిన మలప్పురం నివాసి 38 ఏళ్లలో ‘క్లాడ్ 1 బి స్ట్రెయిన్’ సంక్రమణ గుర్తించారు.

Read Also: MP Kumari Selja: నా గుండెల్లో కాంగ్రెస్ రక్తం ఉంది.. ఆహ్వానించవద్దు, సలహా ఇవ్వవద్దు

కాగా.. రోగి పరిస్థితి నిలకడగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతకుముందు.. హర్యానాలోని హిసార్‌కు చెందిన 26 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ వైరస్ సోకింది. డబ్ల్యూహెచ్‌వో 2022 నుండి మంకీపాక్స్‌ను ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ’గా ప్రకటించినప్పటి నుండి భారతదేశంలో 30 కేసులు నమోదయ్యాయి. కాగా, ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని లోక్‌నాయక్‌ జైప్రకాశ్‌ నారాయణ్‌ (ఎల్‌ఎన్‌జేపీ) ఆస్పత్రిలో చేరిన మంకీపాక్స్ రోగి డిశ్చార్జి అయ్యారు. ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారులు ధృవీకరించారు.

Read Also: Maharashtra: పూణే ఎయిర్పోర్ట్ పేరు మార్పు.. షిండే ప్రభుత్వం కీలక నిర్ణయం