Under-19 World Cup: సెమీఫైనల్లోకి భారత్.. ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ ఔట్
Under-19 World Cup: అండర్-19 ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన సూపర్ 6 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత అండర్-19 జట్టు అద్భుతమైన విజయం సాధించి అండర్-19 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 253 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గెలుపు కోసం మైదానంలోకి దిగిన పాకిస్థాన్ అండర్-19 జట్టు కేవలం 194 పరుగులకే ఆలౌట్ అయింది. 58 పరుగుల భారీ విజయంతో టీమిండియా జట్టు విజయం సాధించింది.
READ ALSO: Police Act: తిరుపతి జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు.. ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
253 పరుగుల లక్ష్యఛేదనలో పాక్ 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. ఉస్మాన్ ఖాన్ (66), హంజా జహూర్ (42), ఫర్హాన్ యూసఫ్ (38) పరుగులు నమోదు చేశారు. మిగతా బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో ఖిలాన్ పటేల్ 3, ఆయుష్ మాత్రే 3, అంబరీష్, హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్, విహాన్ మల్హోత్రా తలో వికెట్ తీసుకున్నారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌటైంది.
47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో ఉన్న టీమిండియాను వేదాంత్ త్రివేది (68; 98 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) కీలకమైన ఇన్నింగ్స్‌తో నిలబెట్టాడు. వైభవ్ సూర్యవంశీ (30; 22 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. కెప్టెన్ ఆయుష్ మాత్రే స్కోర్ చేయకుండానే వెనుదిరిగాడు. ఆర్.ఎస్.అంబరీష్ (29), విహాన్ మల్హోత్రా (21), అభిజ్ఞాన్ కుందు (16), ఆరోన్ జార్జ్ (16) పరుగులు నమోదు చేశారు. చివర్లో కనిష్క్ చౌహాన్ (35; 29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), ఖిలాన్ పటేల్ (21; 15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడటంతో భారత్ ఈ స్కోర్ సాధించింది. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మహ్మద్ సయ్యమ్ 2, అహ్మద్ హుస్సేన్, మోమిన్, అలీ రజా, అలీ హసన్ తలో వికెట్లు కూల్చారు. ఫిబ్రవరి 3న తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియా -ఇంగ్లాండ్, ఫిబ్రవరి 4న రెండో సెమీ ఫైనల్‌లో భారత్ – అఫ్గానిస్థాన్ బరిలోకి దిగబోతున్నాయి.
READ ALSO: 2026 T20 World Cup: క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఈసారి వరల్డ్ కప్‌లో భారత్-పాక్ సమరం ఉండదు!
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?