NTV Telugu Site icon

T20 World Cup 2024: టీమిండియా టీ20 ప్రపంచకప్‌ ప్రోమో.. గూస్‌ బంప్స్‌ పక్కా!

India Promo

India Promo

India Promo for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ 2024కు సమయం దగ్గరపడుతోంది. జూన్‌ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా పొట్టి ప్రపంచకప్‌ జరగనున్న విషయం తెలిసిందే. మే 1 లోపు అన్ని టీమ్స్ తమ జట్లను ప్రకటించాల్సి ఉంది. భారత జట్టును బీసీసీఐ ఏప్రిల్ 28న ప్రకటించే అవకాశం ఉంది. అయితే స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానల్‌ టీమిండియా టీ20 ప్రపంచకప్‌ ప్రోమోకి సంబంధించి ఓ వీడియో రిలీజ్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘టీ20 ప్రపంచకప్‌ 2024కు భారత్ సిద్ధం’ అంటూ ప్రోమో స్టార్ అయింది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్, రవీంద్ర జడేజా బౌలింగ్, రోహిత్ శర్మ బ్యాటింగ్, సూర్య‌కుమార్ యాదవ్ షాట్స్, హార్దిక్ పాండ్యా బౌలింగ్‌ను వీడియోలో చూపించారు. చివరలో కోహ్లీ సెల్యూట్‌ చేస్తున్న క్లిప్‌ అభిమానుల్లో జోష్‌ నింపుతుంది. బ్యాక్‌ గ్రౌండ్‌లో వందేమాతర గీతం ప్రోమో వీడియోని రక్తి కట్టించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ‘గూస్‌ బంప్స్‌ పక్కా’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యా పనైపోయింది.. టీమిండియా మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

టీ20 ప్రపంచకప్‌ 2024లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. ఈ 20 టీమ్స్ నాలుగు గ్రూపులుగా విడిపోయి పోటీపడతాయి. గ్రూప్‌-ఏలో భార‌త్‌, పాకిస్థాన్, కెన‌డా, యూఎస్ఏ, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. జూన్‌ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో భారత్‌ తన మొదటి మ్యాచ్ ఆడుతుంది. ఇక క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరం జూన్‌ 9న న్యూయార్క్ వేదికగానే జరుగనుంది. జూన్‌ 12న యూఎస్‌ఏ, జూన్‌ 15న కెన‌డాతో భారత్ ఆడనుంది.

Show comments