Team India Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. సంజూ ఎంట్రీ.. ఆ ప్లేయర్‌పై వేటు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Playing XI: టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు ఆ తర్వాత జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పసికూన ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 2-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన టీమిండియా.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో సిరీస్‌ను కూడా ఇప్పటికే 0-3తో కోల్పోయింది. సౌతాంప్టన్ వేదికగా శనివారం జరగబోయే ఆఖరిదైన ఐదో టీ20లో గెలిస్తేనే మరో ఘోర వైట్‌వాష్ పరాభవం నుంచి భారత్ బయటపడుతుంది. కనీస పరువు దక్కించుకోవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా, వరుసగా మూడు మ్యాచ్‌లలో విఫలమైన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై వేటు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, టీ20 ప్రపంచకప్-2026 నాకౌట్ మ్యాచ్‌లలో వరుసగా 97, 89, 89 పరుగులతో రాణించి భారత్‌ను ఛాంపియన్‌గా నిలపడంలో సంజూ శామ్సన్ కీలక పాత్ర పోషించాడు. అయితే, ఆ తర్వాత ఐర్లాండ్‌తో రెండు టీ20లలో 5, 0 పరుగులు చేసిన సంజూ.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిరాశపరిచాడు. దాంతో యాజమాన్యం సంజూను పక్కనపెట్టి, 15 ఏళ్ల లెఫ్టాండర్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చింది. కానీ, వైభవ్ ఇంగ్లండ్‌తో వరుసగా మూడు మ్యాచ్‌లలో 13, 14, 15 పరుగులు మాత్రమే చేసి ఫ్లాప్ అయ్యాడు. జట్టు కూడా వరుస పరాజయాలతో సిరీస్ చేజార్చుకుంది.
మరోవైపు వైభవ్‌తో పాటు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సైతం ఘోరంగా విఫలమవుతున్నారు. జట్టు వరుసగా ఓడిపోతుండటంతో హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో జరిగే ఐదో టీ20 కోసం సంజూను తిరిగి తుదిజట్టులోకి తీసుకోనున్నట్లు గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టాపార్డర్‌లో ముగ్గురూ లెఫ్టాండర్లే (అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్) ఉండటం జట్టుకు సమస్యగా మారింది. అందుకే సంజూను జట్టులోకి తెచ్చి రైట్-లెఫ్ట్ కాంబినేషన్‌తో వెళ్లాలని భావిస్తున్నారు. ఒకవేళ వైభవ్‌ను కొనసాగించాలనుకుంటే.. తిలక్ వర్మ లేదా ఇషాన్ కిషన్‌లలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. అయితే తిలక్ ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు కాబట్టి అతడిని తీసేయడం కష్టం. మరోవైపు, ఇషాన్ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్నప్పటికీ.. వన్‌డౌన్‌లో సంజూ ఆడగలడు కాబట్టి ఇషాన్ స్థానంలోనే సంజూ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో అక్షర్ పటేల్, ప్రసిద్ కృష్ణల స్థానంలో రవి బిష్ణోయి, సూర్యాంశ్ షెడ్గే రేసులోకి రానున్నారు.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
ఇంగ్లండ్‌తో ఐదో టీ20కి భారత అంచనా తుదిజట్టు:
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, సూర్యాంశ్ షెడ్గే, లిటిల్ ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?