NTV Telugu Site icon

IND vs SL: రెండు వికెట్లు కోల్పోయిన భారత్.. నిరాశపరిచిన కోహ్లీ

Ind Vs Sl

Ind Vs Sl

ND vs SL: ఆసియా కప్లో భాగంగా సూపర్ -4 లో నేడు శ్రీలంకతో భారత్ మ్యాచ్ ఆడుతోంది. టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.

Read Also: Genelia: మళ్లీ తల్లి కానున్న జెనీలియా అంటూ వార్తలు.. అసలు విషయం ఇదేనట!

నిన్న పాకిస్తాన్ తో మ్యాచ్ గెలిచి మంచి జోరు మీదున్న టీమిండియా.. శ్రీలంకతో ఆరంభంలో మంచి ప్రారంభాన్ని అందించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ అర్థసెంచరీ సాధించగా.. మరో ఓపెనర్ గిల్(19) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ కూడా కేవలం (3) పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు ఈ మ్యాచ్ లో గెలిస్తే ఆసియా కప్ లో భారత్ ఫైనల్ చేరే అవకాశాలు మరింత మెరుగవుతాయి. ఇప్పుడు జరిగే మ్యాచ్ లో భారత టీమ్ లో ఒక్క మార్పు చేశారు. శార్దూల్ ఠాకూర్ కు విశ్రాంతినిచ్చి అక్షర్ పటేల్ జట్టులోకి తీసుకున్నారు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(52), ఇషాన్ కిషన్ ఉన్నారు. భారత్ రెండు వికెట్లు నష్టపోయి 90 పరుగులు చేసింది.

Read Also: Uddhav Thackeray: రామమందిర సమయంలో “గోద్రా” తరహా ఘటన.. స్పందించిన బీజేపీ

మరోవైపు లంకేయులు వరుసగా 13 వన్డేల్లో గెలిచి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు. గత 13 వన్డే మ్యాచుల్లోనూ శ్రీలంక ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయడం విశేషం. దీంతో ఈ రికార్డును టీమిండియా బ్రేక్ చేయగలదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఆసియాకప్ లో ఇప్పటివరకు రోహిత్ శర్మ కెప్టెన్సీల్లో అన్ని మ్యాచుల్లోనూ టీమిండియా విజయం సాధించింది. కాబట్టి ఓటమి ఎరుగని రోహిత్ శర్మ టీమ్, వరుస విజయాలతో జోరు మీదున్న శ్రీలంక జట్టుకీ మధ్య హోరా హోరీ పోటీ జరుగుతుందని అభిమానులు అంటున్నారు.