NTV Telugu Site icon

Gautam Gambhir: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్.. గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Gambir

Gambir

ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే.. కేవలం దేశాలే కాదు. ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అలాంటిది మొన్న అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో టీమిండియా పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. పోటాపోటీగా మ్యాచ్ కొనసాగుతుందనుకుంటే మ్యాచ్ కాస్తా వన్ సైడ్ అయిపోయింది. ఇక టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన చూపించడంతో పాక్ ఆటగాళ్లు బౌలింగ్, బ్యాటింగ్ లోనూ విఫలమయ్యారు. గెలుపోటముల గురించి పక్కనబెడితే బాబర్ సేన కనీసం ఫైటింగ్ స్కిల్స్ చూపించకపోవడంతో ఆ టీమ్ అభిమానుల్ని బాధించింది. ఇలాంటి ఆటతీరు ఉపఖండంలో క్రికెట్​కు మేలు చేయదని టీమిండియా మాజీ క్రికెటర్, లెజెండరీ బ్యాటర్ గౌతం గంభీర్ అన్నాడు.

Pepper X: మిర్చికే గాడ్ ఫాదర్.. యమ హాట్ గురూ..!

ఈ వరల్డ్ కప్ లోనైనా పాకిస్తాన్ గెలవాలనే కసితో దిగినప్పటికీ.. 8వ సారి ఇండియా చేతిలో ఓటమిపాలైంది. మరోసారి పాకిస్థాన్​పై టీమిండియా అద్భుతం చేసి చూపించిందని గంభీర్ తెలిపాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన చూపించిందని గంభీర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఇండియా-పాక్ ఈ టీమ్స్ ఎప్పుడు ఆడినా హోరాహోరీగా తలపడతాయని.. గెలుపు కోసం చివరి వరకు పోరాడతాయన్నాడు. కానీ ఈ మధ్య కాలంలో జరిగిన మ్యాచ్ ల్లో అలాంటి సందర్భాలు కనపడలేదని తెలిపాడు. పాక్​పై భారత్​దే పూర్తి డామినేషన్ కనిపిస్తోందన్నాడు. అయితే ఉపఖండ దేశాల్లో క్రికెట్​కు ఇది చేటు చేస్తుందని గంభీర్ పేర్కొన్నాడు. ఇండియా-పాక్​ల మధ్య సిరీస్​లు ఉంటే తీవ్ర పోటీ ఉంటుందని మేమెప్పుడూ చెబుతుంటాం.. కానీ ఇప్పుడు ఇలాంటి మ్యాచ్ చూశాక మాత్రం ద్వైపాక్షిక సిరీస్​ల్లోనూ పోటాపోటీగా ఉంటుందని చెప్పలేనని గంభీర్ చెప్పుకొచ్చాడు.

Ram Charan- Upasana : కూతురు క్లింకార తో రామ్ చరణ్, ఉపాసన ఫస్ట్ ఫారెన్ టూర్.. ఫోటోలు వైరల్..

ఇక బుమ్రా-షహీన్​కు మధ్య పోలిక పెడుతుండటంపై గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు. ఈ మ్యాచ్​లో మధ్యాహ్నం 2 గంటల టైమ్​లో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బుమ్రా బౌలింగ్ వేసి ఫస్ట్ స్పెల్​లోనే బ్యాటర్లను కట్టడి చేశాడని.. అతను సూపర్ అని గంభీర్ తెలిపాడు. అయితే ఇండియా-పాక్ మధ్య దైపాక్షిక సిరీస్​లు జరగడం లేదు.. ఫ్యూచర్​లో జరుగుతాయో లేదో చెప్పలేం.. కానీ పాక్ పెర్ఫార్మెన్స్ చూశాక బైలాటరల్ సిరీస్​లు పెట్టినా వేస్ట్ అని.. అక్కడా భారత్ డామినేషన్ ఉంటుందని ఇన్​డైరెక్ట్​గా గంభీర్ చెప్పుకొచ్చాడు.