India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: ఐచి-నాగోయా ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో భారత్, పాకిస్థాన్ మధ్య ఫైనల్ ఫైట్ జరుగుతుందేమోననే ప్రచారం మొదలైంది. అయితే రెండు జట్లకూ సెమీఫైనల్ బెర్త్ దక్కిన తీరు మాత్రం అభిమానులకు కాస్త నిరాశ కలిగించింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే సెమీస్‌కు చేరుకున్నాయి. సోమవారం (సెప్టెంబర్ 27) జరగాల్సిన పాకిస్థాన్ వర్సెస్ హాంకాంగ్, భారత్ వర్సెస్ అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లు రద్దయ్యాయి. టోర్నమెంట్ నిబంధనల ప్రకారం వర్షం పడి మ్యాచ్ జరగకపోతే, మెరుగైన ఐసీసీ ర్యాంకింగ్ ఉన్న జట్టే తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. ఆ లెక్కన టీ20 ర్యాంకింగ్స్‌లో మెరుగ్గా ఉన్న టీమిండియా, పాకిస్థాన్ నేరుగా సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. నిజానికి అఫ్గానిస్తాన్‌తో జరిగే పోరుపై క్రికెట్ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉండేవి. ముఖ్యంగా ఐపీఎల్ 2026లో ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఏషియన్ గేమ్స్ మైదానంలో ఎలా ఆడతాడో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ భారీ వర్షం, తడిసిన అవుట్‌ఫీల్డ్ కారణంగా కనీసం టాస్ కూడా పడలేదు. దాంతో వైభవ్ సూర్యవంశీ ఆటను చూసే అవకాశం చేజారినట్లయింది.
ఇక టోర్నీ తదుపరి షెడ్యూల్ విషయానికి వస్తే, అక్టోబర్ 1 గురువారం రోజున ఇదే మైదానంలో సెమీఫైనల్స్ జరగనున్నాయి. శ్రీలంక, నేపాల్ మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ కూడా వర్షార్పణం కావడంతో, శ్రీలంక సెమీస్‌కు వచ్చింది. దీంతో రెండో సెమీఫైనల్లో భారత్, శ్రీలంకతో తలపడనుంది. మరోవైపు, అక్టోబర్ 1న ఉదయం 5:30 గంటలకే జరిగే మొదటి సెమీఫైనల్లో పాకిస్థాన్ ఆడనుంది. అయితే పాక్‌తో తలపడే జట్టు ఏదనేది సెప్టెంబర్ 29 ఉదయం 10:00 గంటలకు జరగబోయే బంగ్లాదేశ్ వర్సెస్ మలేషియా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ద్వారా తేలుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిస్తే, సెమీస్‌లో పాకిస్థాన్‌కు గట్టి పోటీ ఎదురవ్వడం ఖాయం. ఆ మ్యాచ్ దాటుకుని పాక్ ముందుకు రావడం అనుకున్నంత తేలిక కాదు. మరోవైపు భారత్ కూడా శ్రీలంకను దాటి ఫైనల్‌కు చేరాల్సి ఉంటుంది. ఈ రెండు జట్లూ తమ తమ సెమీస్ గెలిస్తేనే మనందరం కోరుకునే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్ సాధ్యమవుతుంది. దీని తర్వాత టోర్నీలో మిగిలిన పతకాల పోరు అక్టోబర్ 3న జరుగుతుంది. ఉదయం 5:30 గంటలకు బ్రాంజ్ మెడల్ (కాంస్య పతకం) మ్యాచ్, ఉదయం 10:00 గంటలకు ఉత్కంఠభరితమైన ఫైనల్ (గోల్డ్ మెడల్) మ్యాచ్ జరగనున్నాయి. మొత్తానికి ఆసియా క్రికెట్ అభిమానులు ఆశిస్తున్న ఇండో-పాక్ సమరం జరుగుతుందో లేదో తెలియాలంటే మాత్రం ముందుగా సెమీఫైనల్స్ ముగియాల్సిందే!
Also Read
- Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
తాజావార్తలు
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
-
DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
-
Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!