NTV Telugu Site icon

IND vs NZ: అదరగొట్టిన స్పిన్నర్స్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

Ind Vs Nz

Ind Vs Nz

దుబాయ్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ 251 పరుగులు చేసింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్‌గా నిలిచేందుకు భారత్ 252 పరుగులు చేయాల్సి ఉంది. మ్యాచ్‌ మొదట్లో న్యూజిలాండ్ జట్టు 270-280 స్కోరును సులభంగా సాధిస్తుందని అనిపించింది. కానీ బ్యాటర్స్‌కి సాధ్యం కాలేదు. 4 క్యాచ్‌లు వదిలివేసినప్పటికీ.. భారత స్పిన్నర్లు న్యూజిలాండ్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసి వారిని 251 పరుగులకే పరిమితం చేశారు.

న్యూజిలాండ్ తరఫున ఓపెనర్లుగా వచ్చిన విల్ యంగ్, రచిన్ రవీంద్ర రాణించారు. కానీ కుల్దీప్ రాచీన్‌ను పెవిలియన్‌కు పంపాడు. రాచిన్ కేవలం 29 పరుగులు చేసి ఔటయ్యాడు. 23 బంతుల్లో 15 పరుగులు చేసిన విల్ యంగ్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యూ అయ్యాడు. కేన్ విలియమ్సన్ పై న్యూజిలాండ్ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ అతను 11 పరుగులకే పరిమితమయ్యాడు.

కాగా.. డారిల్ మిచెల్ (63), మైకేల్ బ్రాస్‌వెల్ (51) రాణించారు. రచిన్ రవీంద్ర (37), గ్లెన్ ఫిలిప్స్ (34), ఫర్వాలేదనిపించారు. విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లేథమ్ (14), మిచెల్‌ శాంట్నర్‌ (8) పరుగులు చేశారు. నాథన్‌ స్మిత్‌ 0 (1) నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 2, వరుణ్ చక్రవర్తి 2, రవీంద్ర జడేజా, షమి చెరో వికెట్ పడగొట్టారు.

Tags: