India anti dumping duty China: గ్యాస్ సంక్షోభ సమయంలో భారత్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు.. చైనాకు షాక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India anti dumping duty China: ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేవాల్లో ఇంధన, గ్యాస్ సంక్షోభం తలెత్తింది.. అయితే, ప్రపంచ ఇంధన సంక్షోభం మధ్య భారత్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. భారత ప్రభుత్వం, చైనా నుండి దిగుమతి అవుతున్న చౌక ఎల్ఎన్‌జీ (LNG) ట్యాంకులపై యాంటీ-డంపింగ్ సుంకాలు విధించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నిర్ణయం దేశీయ తయారీదారులను రక్షించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. ఇదే సమయంలో.. ఇది డ్రాగన్ కంట్రీకి షాక్ లాంటిది..
ఈ నిర్ణయం ఎందుకు?
వాణిజ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన విచారణలో, చైనా కంపెనీలు ఎల్ఎన్‌జీ ట్యాంకులను అసలు ధర కంటే తక్కువకు (డంపింగ్ ధరలకు) విక్రయిస్తున్నట్లు తేలింది. దీని వల్ల భారతీయ కంపెనీలు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాయి. ఈ అంశంపై Inox India Limited ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది.
Also Read
- Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
యాంటీ-డంపింగ్ సుంకం అంటే ఏమిటి?
యాంటీ-డంపింగ్ సుంకం అనేది విదేశీ కంపెనీలు తక్కువ ధరలకు వస్తువులు విక్రయించి దేశీయ పరిశ్రమలను నష్టపరచకుండా నివారించేందుకు విధించే పన్ను. ఈ సుంకం విధిస్తే.. చైనా ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి.. భారతీయ కంపెనీలకు సమాన పోటీ అవకాశం లభిస్తుంది.. దేశీయ తయారీ రంగం బలోపేతం అవుతుందని అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు..
చౌక దిగుమతుల వల్ల:
అయితే చౌక దిగుమతల వల్ల స్థానిక కంపెనీల లాభాలు తగ్గాయి.. ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతింది.. మార్కెట్‌లో డిమాండ్ కూడా తగ్గింది.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ సిఫార్సులపై త్వరలో ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంధన సంక్షోభ సమయంలో భారత్ తీసుకుంటున్న ఈ చర్య, దేశీయ పరిశ్రమలను రక్షించడమే కాకుండా, భవిష్యత్తులో ఆత్మనిర్భర భారత్ లక్ష్యానికి మరింత బలం చేకూర్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు..
తాజావార్తలు
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!