NTV Telugu Site icon

Mens Junior Asia Cup: భారత్ హ్యాట్రిక్ విజయం.. చైనీస్ తైపీపై గెలుపు

India Hockey Team

India Hockey Team

పురుషుల హాకీ జూనియర్ ఆసియా కప్ 2024లో భాగంగా.. భారత్ మూడో మ్యాచ్ చైనీస్ తైపీతో జరిగింది. ఒమన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 16-0 తేడాతో తైపీని ఓడించింది. ఈ విజయంతో ఇండియా ఈ టోర్నీలో హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. 3 విజయాలతో భారత్ 9 పాయింట్లు సాధించి పూల్-ఎ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. కాగా.. ఈ మ్యాచ్‌లో భారత్‌ తరఫున దిల్‌రాజ్‌ సింగ్‌ 4 గోల్స్‌ చేయగా.. సౌరభ్‌ ఆనంద్‌, రోసన్‌ కుజుర్‌ తలో 3 గోల్స్‌ చేశారు. అర్ష్‌దీప్‌ సింగ్‌ 2 గోల్స్‌, తాలెమ్‌ ప్రియోబర్తా, శార్దానంద్‌ తివారీ, అర్జిత్‌ సింగ్‌ ఒక్కో గోల్‌ చేశారు.

Read Also: Srishti Tuli: పైలట్ ప్రియుడు మామూలోడు కాదు.. ఒక్కొక్కటిగా బయటకొస్తున్న ఘనకార్యాలు

ఈ మ్యాచ్ తొలి క్వార్టర్‌లో భారత్ ఒక గోల్ చేయగా.. రెండో క్వార్టర్‌లో భారత్ మొత్తం 4 గోల్స్ చేసి 5-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో క్వార్టర్‌లో భారత్ అద్భుతంగా ఆడి మొత్తం 8 గోల్స్ చేయగా చైనీస్ తైపీపై 13-0తో వెనుకబడింది. నాలుగో క్వార్టర్‌లో భారత్ మొత్తం 3 గోల్స్ చేయగా.. చివరికి భారత్ 16-0తో మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ టోర్నీలో భారత్ ఇంతకుముందు థాయ్‌లాండ్, జపాన్‌లను ఓడించింది.

Read Also: Cyclone Fengal: తీరాన్ని తాకిన ఫెంగల్ తుఫాన్.. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్..

ఈ టోర్నీలో భారత్ తన మొదటి రెండు మ్యాచ్‌లను గెలుచుకుంది. మొదటి మ్యాచ్‌లో 11-0తో థాయ్‌లాండ్‌ను ఓడించగా.. రెండవ మ్యాచ్‌లో భారత్ 3-2తో జపాన్‌ను ఓడించింది. ఈ టోర్నీలో భారత జట్టు రికార్డు స్థాయిలో నాలుగుసార్లు టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2004, 2008, 2015, 2023లో భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే.. భారత్ ఐదవసారి ఛాంపియన్‌గా అవతరించాలని చూస్తోంది. ఈ టోర్నమెంట్‌లో 10 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో పూల్ Aలో ఇండియాతో పాటు కొరియా, జపాన్, చైనీస్ తైపీ, థాయ్‌లాండ్ ఉన్నాయి. పూల్ B లో పాకిస్తాన్, మలేషియా, బంగ్లాదేశ్, ఒమన్, చైనా ఉన్నాయి.