India: ఇరాన్‌లోని భారతీయులకు హై అలర్ట్.. వెంటనే దేశం విడిచి రావాలని కేంద్రం ఆదేశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం సోమవారం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. అక్కడ ఉన్న భారతీయ పౌరులందరూ వెంటనే ఇరాన్‌ను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు లేదా భారత్‌కు తిరిగి రావాలని సూచించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ ప్రకటనలో ఏం చెప్పిందంటే.. ఇరాన్‌లో ఉన్న విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు ఎవరైనా సరే.. అందుబాటులో ఉన్న విమానాలు లేదా ఇతర రవాణా మార్గాల ద్వారా వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది.
READ ALSO: Quick Sooji Chilla Recipe: కేవలం 10 నిమిషాల్లో టేస్టీ, హెల్దీ బ్రేక్ ఫాస్ట్ రెడీ
Also Read
- Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్‌ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
భారీ జనసమూహాలు, నిరసనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరింది. స్థానిక వార్తలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించింది. అత్యవసరంగా ప్రయాణించాల్సి వస్తే ఇబ్బంది కలగకుండా.. పాస్‌పోర్ట్, వీసా, ఐడి కార్డులను ఎప్పుడూ తమ వద్దే ఉంచుకోవాలని భారతీయులకు తెలిపింది. ఇరాన్‌లో ఉన్న భారతీయులందరూ తమ వివరాలను రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. దీనివల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ప్రభుత్వం నేరుగా వారిని సంప్రదించి సహాయం చేయడానికి వీలవుతుంది.
హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..
మీకు లేదా మీకు తెలిసిన వారికి ఇరాన్‌లో ఏదైనా ఇబ్బంది ఎదురైతే, వెంటనే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించడానికి ఈ నంబర్లు ఉపయోగించాలని సూచించింది.
ఫోన్ నంబర్లు: * +98 9128109115
* +98 9128109109
* +98 9128109102
* +98 9932179359
* ఇమెయిల్: cons.tehran@mea.gov.in
ఇరాన్‌లో పరిస్థితి వేగంగా మారుతున్నందున, అక్కడ ఉన్న భారతీయ పౌరుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరూ రిస్క్ తీసుకోవద్దని, వీలైనంత త్వరగా స్వదేశానికి చేరుకోవాలని సూచించింది.
READ ALSO: HAL Clarifies: తేజస్ విమానం కూలిపోలేదు.. అసలు నిజం ఇదే: పుకార్లపై హెచ్ఏఎల్ స్పష్టత
తాజావార్తలు
-
Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్‌ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Oscars Academy :’RRR’ ఎడిటర్‌కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్‌కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!