మయన్మార్ (Myanmar) పర్యటనకు వెళ్లే భారతీయులను కేంద్రం హెచ్చరించింది. మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రానికి (Rakhine State) వెళ్లొద్దంటూ ఇండియన్స్‌కి కేంద్రం (India issues) సలహా ఇచ్చింది.
రఖైన్ రాష్ట్రంలో భద్రతా పరంగా పరిస్థితులు బాగోలేవని తెలిపింది. అలాగే టెలికమ్యూనికేషన్లతో పాటు నిత్యవసర వస్తువుల కొరత తీవ్రంగా ఉందని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో రఖైన్ రాష్ట్రానికి వెళ్లొద్దని సిటిజన్స్‌కి భారత్ సూచించింది.
అలాగే రఖైన్ రాష్ట్రంలో ఉన్న భారతీయ పౌరులు కూడా వెంటనే రాష్ట్రం విడిచి వెళ్లాలని సూచించింది. ఇటీవల మయన్మార్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో అక్కడ పరిస్థితులు తీవ్ర కలవరం రేపుతోంది.
మయన్మార్ సైన్యం సరిహద్దు ప్రాంతాల్లో వైమానిక దాడులు చేస్తోంది. దీంతో మయన్మార్ నుంచి ఇండో-మయన్మార్ సరిహద్దు వెంబడి మిజోరాం రాష్ట్రంలోకి భారీగా ప్రజలు తరలివస్తున్నారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 1న మయన్మార్ సైనిక తిరుగుబాటు యొక్క మూడవ వార్షికోత్సవాన్ని జరుపుకుంది, అక్కడ మూడు సంవత్సరాల క్రితం జరిగిన తిరుగుబాటులో సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకుంది.
ప్రస్తుతం రఖైన్ రాష్ట్రంలో పరిస్థితులు ఏ మాత్రం క్షేమకరంగా లేవని.. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికెళ్లడం ఏ మాత్రం క్షేమకరం కాదని ఇండియన్స్‌కి కేంద్రం స్పష్టం చేసింది. అక్కడ ఉన్న వారు కూడా అత్యవసరంగా ఖాళీ చేయాలని హెచ్చరించింది.